iDreamPost
android-app
ios-app

Hanuman TV Contest: టీవీలో హనుమాన్ మూవీ.. సెల్ఫీ కాంటెస్ట్ తో విజేతలకు కళ్లు చెదిరే గిఫ్ట్స్!

  • Published Apr 23, 2024 | 4:27 PM Updated Updated Apr 23, 2024 | 4:27 PM

నెల రోజుల క్రితం వరకు కూడా.. అటు థియేటర్స్ ను ఒక ఊపు ఊపేసిన సినిమా "హనుమాన్". ఇక ఇప్పుడెందుకు మళ్ళీ ఈ సినిమా గురించి టాక్ నడుస్తోంది అంటే.. ఈ సినిమా టీవీ లో ప్రసారం కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేటంటే..

నెల రోజుల క్రితం వరకు కూడా.. అటు థియేటర్స్ ను ఒక ఊపు ఊపేసిన సినిమా "హనుమాన్". ఇక ఇప్పుడెందుకు మళ్ళీ ఈ సినిమా గురించి టాక్ నడుస్తోంది అంటే.. ఈ సినిమా టీవీ లో ప్రసారం కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేటంటే..

  • Published Apr 23, 2024 | 4:27 PMUpdated Apr 23, 2024 | 4:27 PM
Hanuman TV Contest: టీవీలో హనుమాన్ మూవీ.. సెల్ఫీ కాంటెస్ట్ తో విజేతలకు కళ్లు చెదిరే గిఫ్ట్స్!

తెలుగునాట ప్రశాంత్ వర్మ తీసిన అద్భుతం “హనుమాన్” సినిమా. ఈ సినిమాతో తేజ సజ్జ కు కూడా మంచి పేరు వచ్చింది. సంక్రాంతి సమయంలో పెద్ద హీరోల చిత్రాల మధ్యన రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా.. ఈ ఏడాది పండగ హిట్ గా నిలిచి .. బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టింది. మీడియా , సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చలు వినిపించాయి. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అన్న రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చిన సమయంలో కూడా ఇలాంటి టాక్ ఏ నడిచింది. ఇప్పుడు అటు థియేటర్స్, ఇటు ఓటీటీని దాటేసి.. టెలివిజన్ లోకి ఎంటర్ అవ్వబోతుంది హనుమాన్ మూవీ. ఈ సినిమాను ఏప్రిల్ 28 సాయంత్రం 5.30 నిమిషాలకు జీ తెలుగులో ప్రసారం చేయనున్నారన్న సంగతి తెలిసిందే. అయితే.. జీ తెలుగు సినిమాతో పాటు.. ప్రేక్షకులకు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ను కూడా తీసుకొచ్చింది. అదేంటో చూసేద్దాం.

“ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో రూపొందిన ‘హనుమాన్’ చిత్రాన్ని ఆస్వాదించడానికి మీరూ సిద్ధంగా ఉండండి. బుల్లితెరపై ‘హనుమాన్’ ఆగమనం ఈ ఆదివారం (ఏప్రిల్ 28) సాయంత్రం 5:30 గంటలకు జీ తెలుగులో మాత్రమే” అంటూ జీ తెలుగు హనుమాన్ సినిమా టెలివిజన్ ప్రసారం గురించి.. అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో సినిమాను ప్రసారం చేయడమే కాకుండా.. ప్రేక్షకులకు కొన్ని సర్ప్రైజ్ లను కూడా తీసుకొచ్చింది. అదే ‘హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్’ . ఈ సెల్ఫీ కాంటెస్ట్ లో పాల్గొని నచ్చిన కిచెన్ ఐటమ్స్ ను బహుమతులుగా పొందవచ్చు. దానికోసం ఏం చేయాలంటే పిల్లలకు ఇష్టమైన ఓ సూపర్ హీరో గెటప్ వేసి.. వారితో ఒక సెల్ఫీ తీసుకుని 9966034441​ నెంబర్​కి మిస్డ్​ కాల్​ ఇవ్వాలి లేదా.. ఆ సమయంలో టీవీ స్క్రీన్​పైన కనిపించే QR కోడ్​ని స్కాన్​ చేసి కూడా సెల్ఫీని అప్​లోడ్​ చేయాలి. విజేతలు ఎవరు అనేది.. హనుమాన్ సినిమా ప్రసార సమయంలో ప్రకటిస్తారట. అంతే కాకూండా హనుమాన్ జిగ్సా ఫజిల్ గేమ్ ని zeeteluguhanuman.zee5.com కి లాగిన్ అయ్యి.. అక్కడ ఇచ్చిన టైమ్ లో లెవెల్స్ ను పూర్తి చేసి స్కోర్ బోర్డు లో లీడర్ గా నిలవండి అంటూ.. జీ తెలుగు తెలియజేస్తుంది.

ఇక హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఇప్పటికే ఆ సినిమా కథ గురించి అందరికి తెలిసే ఉంటుంది. పైగా ఈ సినిమాకు సిక్వెల్ ఉన్న సంగతి కూడా అందరికి తెలుసు. ఇప్పుడు అందరి ఎదురు చూపు.. హనుమాన్ సినిమా సిక్వెల్ కోసమే. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకంటే కూడా.. అందరి అంచనాలను మించి హనుమాన్-2 ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. కానీ ఈ సినిమాను చూడాలంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే. మరి అదిరిపోయే విజువల్స్ తో ప్రశాంత్ వర్మ చేసిన అద్భుతాన్ని మళ్ళీ టెలివిజన్ లో కూడా చూడడానికి రెడీ అయిపోతున్నారు.. మూవీ లవర్స్ . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş