iDreamPost
android-app
ios-app

మరో పాన్ ఇండియా మల్టీ స్టారర్

  • Published Jul 04, 2021 | 4:29 AM Updated Updated Jul 04, 2021 | 4:29 AM
మరో పాన్ ఇండియా మల్టీ స్టారర్

ఇటీవలే టాలీవుడ్ ఎంట్రీని ప్రకటిస్తూ ధనుష్ కొత్త సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది మల్టీ స్టారర్ అని లేటెస్ట్ న్యూస్. మరో హీరోని వెతికే పనిలో దర్శకుడు శేఖర్ కమ్ముల బిజీగా ఉన్నట్టు అప్ డేట్. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల్లోనూ సుపరిచితుడైన నటుడిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఇది కథ డిమాండ్ మేరకే సెట్ చేయబోతున్నట్టుగా వినికిడి. బడ్జెట్ ని భారీగా కేటాయించడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. వేరే తమిళ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ లోనే ఉన్న ధనుష్ తో శేఖర్ కమ్ములతో పాటు నిర్మాతలు కూడా రెగ్యులర్ టచ్ లో ఉన్నారు.

వచ్చే ఏడాది విడుదలకు టార్గెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వరస షెడ్యూల్స్ లో వేగంగా పూర్తి చేసేలా ప్లానింగ్ చేసుకున్నారు. హీరోయిన్ తో పాటు ఇంకా టెక్నికల్ టీమ్ ని ప్రకటించాల్సి ఉంది. సాయిపల్లవి పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఫిదాతో శేఖర్ కమ్ముల బ్రేక్ ఇచ్చిన కారణం ఒకటి కాగా ధనుష్ తో మారి 2 చేసిన అనుభవం వల్ల ఆమె ఓకే చెప్పే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇది ఏ జానర్ లో రూపొందుతుందనే క్లారిటీ మాత్రం ఇంకా రావడం లేదు. తన రెగ్యులర్ స్కూల్ తరహాలో కాకుండా ఎంటర్ టైన్మెంట్ ని కాస్త ఎక్కువ జోడించి శేఖర్ కమ్ముల దీన్ని రూపొందించబోతున్నట్టు తెలిసింది. మరిన్ని వివరాలు రావాలి

ఇటీవలి కాలంలో తమిళ హీరోలు మన తెలుగు మార్కెట్ ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. ధనుష్ అయ్యాడు. నెక్స్ట్ విజయ్ రాబోతున్నాడు. ఆపై సూర్య కూడా లైన్ లో ఉన్నాడు. ద్విభాషా చిత్రాలు చేయడం ద్వారా ఇక్కడ ఇమేజ్ ని పెంచుకోవడంలో భాగంగా కోలీవుడ్ స్టార్లు వేస్తున్న స్కెచ్ తెలివిగా ఉంది. గతంలో రజనీకాంత్, విక్రమ్ లు తొలుత సాధించి పోగొట్టుకున్న మంచి మార్కెట్ ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారి పోకుండా ఉండేలా స్ట్రాటజీలు వేసుకుంటున్నారు. రఘువరన్ బిటెక్ తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ సక్సెస్ దక్కించుకోలేకపోయిన ధనుష్ కోరిక తీర్చే భారం శేఖర్ కమ్ములదే

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş