iDreamPost
android-app
ios-app

ధమాకా దెబ్బకి శ్రీలీల పేరు మారుమోగుతోంది!

  • Published Dec 26, 2022 | 8:14 PM Updated Updated Dec 26, 2022 | 8:14 PM
  • Published Dec 26, 2022 | 8:14 PMUpdated Dec 26, 2022 | 8:14 PM
ధమాకా దెబ్బకి శ్రీలీల పేరు మారుమోగుతోంది!

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కనిపిస్తోంది. వరుసగా స్టార్స్ పక్కన పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి హీరోయిన్స్ ని చూసి చూసి ఆడియెన్స్ బోర్ గా ఫీలవుతున్నారు. కొత్త హీరోయిన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకుంటుందని భావించారంతా. కానీ వరుస ఫ్లాప్ లతో రేసులో వెనకబడిపోయింది. ఈ క్రమంలో ప్రస్తుతం మరో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు మారు మోగుతోంది.

కన్నడ చిత్రాలతో సినీ ప్రయాణం ప్రారంభించిన శ్రీలీల.. 2021లో విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. శ్రీలీల అందానికి, అభినయానికి, నాట్యానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు ‘ధమాకా’తో దుమ్ము రేపుతోంది. రవితేజ సరసన ఆమె నటించిన ఈ చిత్రం తాజాగా విడుదలై మాస్ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇందులో శ్రీలీల ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, డ్యాన్స్ గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు.

రవితేజ అంటేనే ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ కి పెట్టింది పేరు. అలాంటిది ఆయన పక్కన నటించి కూడా శ్రీలీల తన ప్రత్యేకతను చాటుకోవడం విశేషం. ముఖ్యంగా ఆమె డ్యాన్స్ స్టెప్పులకి థియేటర్ లో క్లాప్స్ కొట్టడమే కాదు.. బయటకు వచ్చాక కూడా ఆమె డ్యాన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ జనరేషన్ హీరోయిన్స్ లో సాయి పల్లవికి తిరుగులేని డ్యాన్సర్ గా పేరుంది. అయితే ఆమె కమర్షియల్ సినిమాలకి దూరంగా అంటూ, సెలెక్టెడ్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ధమాకా రాకతో.. కమర్షియల్ సినిమాలకు సరిపోయే సాయి పల్లవి దొరికేసింది అంటూ ఎందరో నెటిజన్లు సోషల్ మీడియాలో శ్రీలీలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

‘ధమాకా’ విడుదలకు ముందే శ్రీలీలకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో NBK 108(బాలకృష్ణ, అనిల్ రావిపూడి), RAPO 20(రామ్ పోతినేని, బోయపాటి శ్రీను), నితిన్ 32(నితిన్, వక్కంతం వంశీ) తో పాటు.. అనగనగా ఒక రాజు, జూనియర్ వంటి పలు సినిమాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ధమాకా దెబ్బకు ఆమెకు ఆఫర్లు క్యూ కట్టడం గ్యారెంటీ అంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆమె గురించి, ఆమె డ్యాన్స్ ల గురించే చర్చలు జరుగుతున్నాయి. గ్లామర్ కి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్, డ్యాన్స్ తోడవ్వడంతో ఆమెకు త్వరలోనే స్టార్ స్టేటస్ దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş