iDreamPost
android-app
ios-app

జనవరి 20 – ఓటిటి రిలీజులు

  • Published Jan 19, 2023 | 4:21 PM Updated Updated Jan 19, 2023 | 4:21 PM
జనవరి 20 – ఓటిటి రిలీజులు

రేపు బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ రిలీజులు ఏమీ లేవు. సంక్రాంతి సినిమాల తాకిడి కనీసం పది రోజులకు పైగానే ఉంటుందని ముందుగా ఊహించిన నిర్మాతలు దానికి తగ్గట్టే తమ కొత్త చిత్రాలను విడుదల చేసే సాహసం చేయడం లేదు. అయితే ఓటిటి ఆప్షన్లు మాత్రం చాలానే ఉండబోతున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ రచనలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘ఏటిఎం’ వెబ్ సిరీస్ జీ5లో వస్తుంది. ప్రమోషన్లు గట్టిగానే చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్ర పోషించిన హిందీ ఫిలిం ‘చత్రీవాలీ’ ఇదే ప్లాట్ ఫార్మ్ లో రానుంది. ఐశ్వర్య రాజేష్ టైటిల్ రోల్ పోషించిన ‘డ్రైవర్ జమున’ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. హాళ్లలో ఎవరూ పట్టించుకోని బొమ్మ ఇది.

సిద్దార్థ్ మల్హోతా రష్మిక మందన్న జంటగా నటించిన స్పై డ్రామా ‘మిషన్ మజ్ను’ నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ట్రైలర్ ఆకట్టుకుంది. రెండు రోజులు ఆలస్యంగా 22న రవితేజ లేటెస్ట్ మాస్ బ్లాక్ బస్టర్ ‘ధమాకా’ ఇదే ఓటిటిలో చూసేయొచ్చు. పృథ్విరాజ్ నటించిన కొత్త మలయాళం హిట్ మూవీ ‘కాప’ నిన్నటి నుంచి తెలుగు ఆడియోతో సహా అందుబాటులోకి వచ్చేసింది. అంజలి టైటిల్ రోల్ పోషించిన ‘ఝాన్సీ’ సెకండ్ సీజన్ డిస్నీ హాట్ స్టార్ లో వచ్చేసింది. ఇవి కాకుండా రెప్రెసెంట్, బేక్ స్క్వాడ్, బ్లింగ్ ఎంపైర్, షామారన్, శాంటి టౌన్, ఫవ్ దా, జుంగ్ ఈ, లాస్ట్ మ్యాన్ ఫౌండ్ తదితర దేశ విదేశాల ఇంటర్నేషనల్ కంటెంట్ ని ఈ వీకెండ్ మొత్తం హ్యాపీగా చూసేయొచ్చు.

ఇన్నేసి ఉన్నాయి కాబట్టి థియేటర్లలో కొత్తవేమీ లేవనే చింత అక్కర్లేదు. పోటీని తట్టుకోవడానికి ప్రతి శుక్రవారం ఏదో ఒక క్రియేటివ్ కంటెంట్ ని ఓటిటిలు ప్లాన్ చేస్తున్నాయి. గత వారం నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ముకుందన్ ఉన్ని అసోసియేట్స్ కు దక్కుతున్న ఆదరణ దానికి ఉదాహరణ. ఏదైనా కంటెంట్ రిలీజ్ చేస్తున్నప్పుడు దానికి వివిధ భాషల్లో అనువాదం ఉండేలా ఓటిటిలు తీసుకుంటున్న శ్రద్ధ మంచి ఫలితాలు ఇస్తోంది. ప్రేక్షకులు కూడా ఎక్కువ ఎంజాయ్ చేయడానికి అవకాశం దక్కుతోంది. క్రమంగా సగటు మధ్య తరగతి కుటుంబాల్లోనూ హోమ్ థియేటర్ కల్చర్ పెరుగుతున్న తరుణంలో నిర్మాతలు క్వాలిటీ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే