iDreamPost
android-app
ios-app

విష సర్పాలతో డిప్యూటీ సీఎం భార్య! ఫోటోలు వైరల్..

  • Published Jul 15, 2023 | 3:29 PM Updated Updated Jul 15, 2023 | 3:29 PM
  • Published Jul 15, 2023 | 3:29 PMUpdated Jul 15, 2023 | 3:29 PM
విష సర్పాలతో  డిప్యూటీ సీఎం భార్య! ఫోటోలు వైరల్..

నేటికాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగి పోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియాను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను  అభిమానులతో పంచుకుంటారు. ఎక్కువగా సినీ రంగానికి చెందిన వారు తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటారు. రాజకీయ రంగానికి చెందిన వారిలో చాలా తక్కువ మంది సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు మహారాష్ట్ర డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణీ అమృత ఫడ్నావీస్.

అమృత ఫడ్నావీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తనక సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటుంది. తాజాగా తన పోస్టులతో నెటిజన్లు ఆశ్చర్యపర్చారు అమృతా ఫడ్నావీస్. మనుషుల స్వభావం గురించి చెప్తూ.. ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెటింట చక్కర్లు కొడుతున్నాయి.  చేతుల్లో పాములు, బల్లిని పట్టుకొని ఆమె ఫోటోలు దిగారు.  ‘అత్యంత క్రూరమైన, విషపూరితమైన జంతువులు మనుషులు మాత్రమే’ అంటూ  ఫిక్స్ తో పాటు రాసుకొచ్చారు.  ఈ ఫిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఆమె పోస్టు కు నెటిజన్లు సైతం  తమదైన శైలిలో స్పందించారు.  ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్నది ఇదేనంటూ కామెంట్ చేశారు.  మీరు చెప్పింది  100 శాతం నిజం మేడమ్ అంటూ మరికొందరు  నెటిజన్లు పోస్ట్ చేశారు.  బ్యాంకరైన అమృత.. తన సోషల్ మీడియా అకౌంట్ లో వివిధ అంశాల గురించి తరచూ పోస్టు పెడుతుంటారు. వాటిలో ఆమె వ్యక్తితమైన, వృత్తి పరమైన, ఆరోగ్యానికి సంబంధించినవి కూడా ఉంటాయి. కానీ తాజాగా ఆమె పాములతో  దిగిన ఫోటో మాత్రం వాటన్నిటికి భిన్నంగా  ఉంది. కొన్ని రోజుల క్రితం ఓ కేసు విషయంలో ఈమె వార్తల్లో నిలిచారు.

అమృత ఫడ్నావీస్ ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసే డబ్బులు డిమాండ్ చేసిన కేసులో క్రికెట్ బుకీల అనిల్ జై సింఘానీ, ఆయన కుమార్తె అనిక్షపై పోలీసులు  కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  అప్పటికే 15 కేసుల్లో  నిందితుడైన  అనిల్ 8 ఏళ్లుగా  పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. ఎట్టకేలకు మార్చిలో అతడిని అరెస్టు  చేశారు. ఈ కేసు విషయంలో అమృత ఫడ్నావీస్ వార్తల్లో నిలిచారు.  తాజాగా ఈ ఫోటోలతో మరోసారి సోషల్ మీడియాలో సందడి చేశారు. మరి.. వైరల్ అవుతున్న డిప్యూటీ సీఎం భార్య ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş