Dharani
Delhi Liquor Case Kavitha Get Bail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరయ్యింది. ఆ వివరాలు..
Delhi Liquor Case Kavitha Get Bail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరయ్యింది. ఆ వివరాలు..
Dharani
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు ఆమెకు బెయిల్ మంజూరు అయ్యింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత.. దాదాపు ఐదు నెలల పాటు జైలులోనే ఉంది. ఈడీ కేసులో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కవితను ఈ ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంది. ఇప్పటికి రెండు సార్లు ఆమె అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోనే తాజాగా కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసుకు సంబంధించి ఈడీ.. ఈ ఏడాది మార్చి 5న, హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 11న సీబీఐ కూడా కవితను అదుపులోకి తీసుకుంది. కవిత.. సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల స్కాంకు పాల్పిడనట్లు అభియోగాలు మోపారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. న్యాయస్థానం ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దాంతో గత 5 నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉంది. ఈ కేసులో ఆమె పలుమార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
5 నెలల తర్వాత.. సుప్రీంకోర్టు.. కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా కవిత ఈడీ కేసులో 5 నెలలుగా జైల్లో ఉన్నారని.. సీబీఐ కేసులో 4 నెలలుగా జైల్లో ఉన్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రికవరీ లేదన్నారు. ఈ కేసులో రూ. 100 కోట్లు చేతులు మారాయన్నది కేవలం ఆరోపణలు మాత్రమే అని ఆయన ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. పీఎంఎల్ఏలోని సెక్షన్ 45 ప్రకారం కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని వాదించారు. కవిత మీద లేనిపోని ఆరోపణలు చేశారని.. ఈ కేసులో ఆమె ఎవరినీ బెదిరించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుమారు గంటన్నరపాటు సుదీర్ఘ వాదనల తర్వాత.. ఈ కేసులో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది.