iDreamPost
android-app
ios-app

Deepthi Shanmukh : లిమిట్ దాటితే ఇబ్బందే.. బ్రేకప్ తో సుఖాంతమేనా?

Deepthi Shanmukh : లిమిట్ దాటితే ఇబ్బందే.. బ్రేకప్ తో సుఖాంతమేనా?

యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా గురించి మామూలు జననానికి బిగ్ బాస్ వచ్చాక తెలుసేమో కానీ, కాస్త సోషల్ మీడియా టచ్ ఉన్న అందరికీ ఈ జంట సుపరిచితమే. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, రీల్స్, టిక్ టాక్ లలో జంటగా వీరిద్దరికీ ఒక ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. వైవా అనే సిరీస్ ద్వారా పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ఆ తర్వాత కవర్ సాంగ్స్ చేస్తూ, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్ లు చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. అతని కెరీర్ మొదటి నుంచి అండగా నిలబడింది దీప్తి. తనదగ్గర డబ్బు లేనప్పుడు కూడా ఆమె తనకు సహాయం చేసి ఆదుకుందని, ఆమె వల్లే ఇక్కడ ఉన్నానని కూడా బిగ్ బాస్ లో చెప్పుకున్నాడు. అలాంటిది షణ్ముఖ్, దీప్తి సునైనా ఐదేళ్ల వీరి రిలేషన్ కు ముగింపు పలికారు. నేడో రేపో పెళ్లి చేసుకుంటారని అనుకున్న వీరి రిలేషన్ అర్ధాంతరంగా ఎండ్ కార్డ్ పడడానికి బిగ్ బాస్, దాని యాజమాన్యం ప్రధాన భూమిక పోషించగా సిరి పరోక్ష భూమిక పోషించింది. ఈ మధ్యనే ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో ఆయన రన్నరప్ గా నిలిచాడు. అయితే అతను హౌస్ లో సిరితో చేసిన పనులు సాధారణ ఆడియన్స్ కే ఛీ కొట్టించే విధముగా ఉన్నాయి. మరి అతనే లోకం అతనే తన వాడు అనుకున్న దీప్తి ఎంత క్షోభ అనుభవించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే కొద్దిరోజులుగా వ‌స్తున్న వార్త‌లే నిజ‌మ‌య్యాయి ! యూట్యూబ‌ర్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్‌తో దీప్తి సున‌యిన విడి పోయింది. త‌మ ఐదేళ్ల ప్రేమ‌బంధానికి పుల్‌స్టాప్ పెడుతున్నామ‌ని కొత్త సంవత్సరానికి కొద్దీ సేపటి ముందు ప్ర‌క‌టించింది. కొత్త సంవ‌త్స‌రం అడుగుపెట్టకుండానే ఈ బంధాన్ని ముగిస్తున్నామని చెప్పి.. అంద‌రికీ షాకిచ్చింది. ఈ మేర‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దీప్తి సున‌యిన సుదీర్ఘ పోస్టు పెట్టింది. ”నేను, ష‌ణ్ముఖ్ ఇద్ద‌రం ప‌ర‌స్పర అంగీకారంతో విడిపోయి ఎవ‌రి దారి వారు చూసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం, ఎంతో ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. గ‌త ఐదేళ్ల‌లో మేమిద్దరం ఎంతో సంతోషంగా గ‌డిపాం. ఆ స‌మ‌యంలోనే మాలోని రాక్ష‌సుల‌తో పోరాడాం. చివ‌ర‌కు మీరంద‌రూ కోరుకున్న‌ట్లుగానే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం” అని చెప్పుకొచ్చింది.

”దీనిపై చాలాకాలంగా పోరాడుతూనే ఉన్నాం కానీ, సోష‌ల్ మీడియాలో క‌నిపించినంత సులువేం కాదు. ఇద్ద‌రం క‌లిసి ఉండేందుకు చాలా ప్ర‌య‌త్నించాం. ఈ క్ర‌మంలో మా లైఫ్‌లో ఏది అయితే అవ‌స‌ర‌మో దాన్నే విస్మ‌రించాం. చివ‌ర‌కు మా దారులు వేర‌ని అర్థం చేసుకున్నాం. అందుకే ఇక్క‌డితో ఆగిపోకుండా ముందుకు సాగాల‌ని భావించి ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఇప్పుడు ఇది మాకు ఎంతో క్లిష్ట‌మైన స‌మ‌యం. కాబ‌ట్టి ఈ పరిస్థితుల్లో మా ప్రైవ‌సీకి భంగం క‌లిగించర‌ని ఆశిస్తున్నాం” అంటూ దీప్తి సున‌యిన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఎందుకొచ్చిన గోల అనుకుందో ఏమో కానీ ఈ పోస్ట్ కు కామెంట్ సెక్ష‌న్‌ను కూడా ఆఫ్ చేసింది. నిజానికి సిరితో షన్ను చేసిన రచ్చకు దీప్తి బాగా హర్ట్ అయింది.

అందుకే బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత షణ్ముఖ్ ని కలవలేదు. నిజానికి షన్ను-సిరి మధ్య జరిగింది స్క్రిప్టెడ్ అయితే ఇంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు.. ఎందుకంటే దీప్తి షోలో పాల్గొన్నప్పుడు కూడా తనీష్ తో లవ్ లో ఉన్నట్టు భ్రమ కల్పించారు. కానీ షన్ను-సిరి ప్రవర్తనే వెగటు పుట్టించింది. అందుకే ఆమె షన్ను తనను కలిసి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. నిజానికి బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అందరూ భావిస్తుంటారు. వాళ్లకు కావాల్సింది టీఆర్పీలు కాబట్టి వాళ్లకు కావాల్సింది వాళ్ళు అడిగి చేయించుకుంటారు. కానీ అది ఎక్కడి వరకు చేయాలి అనే అవగాహన షన్ను-సిరి లకు ఉండి ఉంటే ఈ విషయం ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదేమో… ఏదేమైనా వీరి బ్రేకప్ కు మూలకారణం బిగ్ బాసే అంటున్నారు మెజారిటీ నెటిజన్లు. మీరేమంటారు మరి?

Also Read : 

Jojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetmadridbetMadridbetbetciomatbet girişjojobetGrandpashabet Fenerbahçedeneme bonusu veren sitelerdeneme bonusu veren sitelerJojobet girişMarsbahis GirişJojobetbetparkCasibom