iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి

ఎట్టకేలకు నిర్భయ దోషులకు ఉరి

8 సంవత్సరాల అనంతరం ఎట్టకేలకు నిర్భయకు న్యాయం జరిగింది.. ఉరి శిక్షపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ నిందితులు చివరివరకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు..ఉరిశిక్షను అమలు చేయాలన్న పటియాలా కోర్టును తీర్పును సవాలు చేస్తూ నిర్భయ దోషులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వీరి ప్రయత్నాలు ఫలించలేదు. పటియాలా హౌస్‌ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ సంజీవ్‌ల ద్విసభ్య ధర్మాసనం యథాతథంగా ఉరి శిక్ష అమలు చేయాలని తేల్చి చెప్పింది. దీంతో నిర్భయ దోషులు అర్ధరాత్రి దాటిన తర్వాత మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు.

అక్షయ్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్త, వినయ్‌ శర్మలు, ముఖేష్ లు ఉరిశిక్షపై స్టే విధించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఆర్‌. భానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం నిర్భయ దోషుల పిటిషన్‌ను కొట్టివేసింది. ఉరిని యథాతథంగా అమలు చేయాలని తీర్పునిచ్చింది. దీంతో నిర్భయ దోషులు నలుగురిని ఒకేసారి తలారి పవన్ ఉరితీశారు…

2012 డిసెంబర్ 16 న కదులుతున్న బస్సులో దేశ రాజధాని ఢిల్లీలో ఆరుగురు నిందితులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే… తీవ్ర గాయాలపాలయిన నిర్భయ 18 రోజులు ప్రాణాలతో పోరాడి చనిపోయింది.. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి.. ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు కావడంతో పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..