iDreamPost
android-app
ios-app

తన స్థానంలో ఎస్సైగా కుమార్తెకు బాధ్యతలు అప్పగించిన తండ్రి!

తన స్థానంలో ఎస్సైగా కుమార్తెకు బాధ్యతలు అప్పగించిన తండ్రి!

తల్లిదండ్రులు పిల్లలు పుట్టడంతో ఎంతో సంతోషిస్తారు. అయితే ఆ పిల్లలే ప్రయోజకులు అయితే ఇంకా ఎంతో సంతోషిస్తారు. ఇక తమకన్న ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు ఆతల్లిదండ్రుల సంతోషానికి అవధులు  ఉండవు.  అలాంటి ఆనందాన్నే ఓ తండ్రి ఆస్వాధిస్తున్నారు. తాను పోలీసులు అధికారిగా విధులు నిర్వహిస్తున్న స్థానానికి తన కుమార్తె వచ్చి.. బాధ్యతలు చేపట్టడం  ఆ తండ్రి పొందే సంతోషం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఇంకా విశేషం ఏమిటంటే.. ఆ తండ్రే స్వయంగా కుమార్తెకు ఘన స్వాగతం చెప్పారు. ఈ  మధురమైన సన్నివేశానికి వేదికగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్ వేదికగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కర్ణాటక రాష్ట్రం  మాండ్య నగరంలోని సెంట్రల్  పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గా వెంకటేష్ అనే వ్యక్తి  విధులు నిర్వర్తిస్తోన్నారు. ఆయన కుమార్తె వర్ష గత ఏడాది పీఎస్ఐ పరీక్షల్లో ఉద్యోగానికి ఎంపికైంది. ప్రొబేషనరీ పీఎస్ఐగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన వర్ష.. ఇటీవలే తన ట్రైనింగ్ పూర్తీ చేసుకుంది. దీంతో అధికారులు వర్షకు.. తండ్రి వెంకటేష్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ కు అధికారిగా  పోస్టింగ్ ఇచ్చారు. దీంతో తన పోలీస్ స్టేషన్ లో విధులను తీసుకోవడానికి వచ్చిన కుమార్తె వర్షకు ఘన స్వాగతం పలికారు. అంతేకాక తన విధులను కుమార్తెకు అప్పగించారు. ఈ అరుదైన, మధురమైన ఘటనను పోలీస్‌స్టేషన్‌లో అందరూ ఎంతో సంతోషముగా వీక్షించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తన కుమార్తె వర్షకు వెంకటేష్‌ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వెంకటేష్ 16 ఏళ్ల ఆర్మీలో సేవలను అందించి అక్కడ పదవి విరమణ చేశారు. ఆ తర్వాత 2010లో ఎస్సై పరీక్షలు రాసి ఉత్తీర్ణతను సాధించి… ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టారు. పోలీసు అధికారికగా తండ్రిని చూసి వర్ష ప్రేరణ పొంది.. పోలీస్ అవ్వాలనుకుంది. 2022లో జరిగిన పీఎస్ఐ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. యాదృచ్ఛికంగా ఏడాది ప్రొబేషనరీగా శిక్షణ పూర్తి చేసుకున్న వర్షకు తండ్రి పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌కే పోస్టింగ్ వచ్చింది. వెంకటేశ్‌కు బదిలీ కాగా తండ్రి పనిచేసిన ప్లేస్ లో వర్ష బాధ్యతలను స్వీకరించారు. అరుదైన సన్నివేశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.