iDreamPost

అక్కడ ఒకేసారి 4,600 ల్యాప్ టాప్స్ సీజ్! అసలు ఏమి జరిగింది అంటే?

  • Published Jun 11, 2024 | 5:33 PMUpdated Jun 11, 2024 | 5:33 PM

ముంబైలోని నవా షెవా ప్రాంతంలోని జవహర్‌లాల్ నెహ్రూ కస్టమ్ హౌస్  వద్ద స్పెషల్ ఇంటెలిజెన్స్,  ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (SIIB)  అధికారులు సోమవారం రైడ్స్ ను నిర్వహించారు. కాగా, ఈ రైడ్స్ లో అధికారులకు ఏకంగా 4,600 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి ధర తెలిస్తే షాక్ అవుతారు.

ముంబైలోని నవా షెవా ప్రాంతంలోని జవహర్‌లాల్ నెహ్రూ కస్టమ్ హౌస్  వద్ద స్పెషల్ ఇంటెలిజెన్స్,  ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (SIIB)  అధికారులు సోమవారం రైడ్స్ ను నిర్వహించారు. కాగా, ఈ రైడ్స్ లో అధికారులకు ఏకంగా 4,600 ల్యాప్ టాప్ లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటి ధర తెలిస్తే షాక్ అవుతారు.

  • Published Jun 11, 2024 | 5:33 PMUpdated Jun 11, 2024 | 5:33 PM
అక్కడ ఒకేసారి 4,600 ల్యాప్ టాప్స్ సీజ్! అసలు ఏమి జరిగింది అంటే?

ఇటీవల కాలంలో చాలామంది ఈజీగా డబ్బులు  సంపాదించడానికి ఆలవాటు పడిపోయారు. అందుకోసం లేనిపోని దందాలు, స్కామ్స్, దొంగతనాలు వంటివి చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. రాను రాను దేశంలో ఇలా అక్రమంగా సంపాదించే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా వినిపిస్తున్న పేరు స్మగ్లింగ్. ఈ స్మగ్లింగ్స్ పేరుతో కొంతమంది భారీగానే అక్రమంగా ధనం కూడబెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వీటిలో బంగారం దగ్గర నుంచి మత్తు పదార్థలు, ఎలక్ట్రిక్ వస్తువుల వరకు ప్రతిదీ స్మగ్లింగ్స్ చేస్తున్నారు. ఇక ఈ ఇలాంటి రవాణాలపై సోదాలు నిర్వహించిన అధికారులు తరుచూ తనిఖీలు చేస్తూ.. ఇలాంటి ముఠాలను పట్టుకుంటున్న విషయం  తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే ముంబై నగరంలో చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ముంబైలోని నవా షెవా ప్రాంతంలోని జవహర్‌లాల్ నెహ్రూ కస్టమ్ హౌస్  వద్ద స్పెషల్ ఇంటెలిజెన్స్,  ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (SIIB)  అధికారులు సోమవారం రైడ్స్ ను నిర్వహించారు. ఈక్రమంలోనే..  UAE నుంచి దిగుమతి అయిన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ రైడ్స్ లో ఏకంగా 4,600 ల్యాప్ లను అలాగే 1,546 CPUలను స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేశారు. కాగా, ఇవి అన్ని ఇదివరకే ఉపాయోగించిన ల్యాప్ టాప్ లు కావడం గమన్హారం. ఇక స్వాధీనం చేసుకున్న వస్తువుల విలవ రూ. 4.11 కోట్లు ఉంటుంది. అయితే స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్స్, CPUలు UAE నుంచి దిగుమతి చేయబడినివిగా అధికారులు గుర్తించారు. అయితే నిజానికి ఈ ఎలక్ట్రిక్ సరఫరా అంతా హాంకాంగ్ కు చెందినది. కానీ, వీటిని ముంబైలో దిగుతమతి చేస్తున్నారు. ఇకపోతే ఈ ల్యాప్ టాప్స్ అన్నీ వివిధ బ్రాండ్‌లకు  (Dell, HP, Lenovo ) చెందినవి అని పోలీసులు గుర్తించారు.   అంతేకాకుండా.. స్మగ్లింగ్ వస్తువుల విక్రయాల ద్వారా దిగుమతిదారుల నుంచి ₹ 27.37 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

 అయితే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి) పాలసీ ప్రకారం.. ఈ ల్యాప్ టాప్ లు అన్నీటికి సరైన డాక్యూమెంట్స్ కూడా లేకుండా దిగుమతి చేస్తున్నారని సోమవారం ఓ ప్రకటనలో అధికారులు తెలిపారు. ముఖ్యంగా దిగుమతిదారులు అన్నీ ఉపయోగించిన ల్యాప్ టాప్ ను మదర్‌బోర్డు కేసింగ్‌గా తప్పుగా ప్రకటించడం ద్వారా.. వాటిని ఢిల్లీలోని ఐసిడి పట్‌పర్‌గంజ్ ద్వారా అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కస్టమ్స్ న్హవా షెవా విడుదలలో తెలిపారు. ఇక ఈ అక్రమలకు తెరపడి ఇన్ని వేల లాప్ ట్యాప లను దిగుమతి చేస్తున్న ఓ సంస్థ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి