ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అందుకే ప్రపంచంలో ఏ మూలన, ఏం జరిగిన క్షణాల్లో మనకు తెలిసిపోతుంటాయి. ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతుంటాయి. కొన్ని కామెడీగా, మరికొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. మరికొన్ని వీడియోలను చూస్తే ఒళ్లు గుగ్గురు పుడుతుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా నీటిలో ఉండాల్సిన మొసళ్లు ఓ ఇంట్లోని నేల అడ్డుగున దాక్కున్నాయి. అటవీ అధికారులు వచ్చి.. వాటిని బయటకు తీసే ప్రయత్నం చేయగా.. ఒక ఊదుటన నేలను చీల్చుకుంటూ బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ మొసళ్లకు సంబంధించిన వీడియోను @Figen అనే అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక వీడియోలో ఓ ఇంట్లో నేలకు పగుళ్లు కనిపించాయి. అంతేకాక కాసేపటి తరువాత సగభాగం లోపలికి, మరో సగభాగం బయటకు ఉన్న మొసలిని ఆ ఇంట్లో వారు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న వాళ్లు మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో మొసలి కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది. చివరకు ఇది పూర్తిగా వచ్చే క్రమంలోనే భూమి లోపలి నుంచి మరో మొసలి కూడా బయటకు వచ్చింది. ఇలా అకస్మాత్తుగా మరో మొసలి రావడంతో అక్కడున్న జనం గుండెలు గుభేలుమన్నాయి.
ఒక మొసలి ని పట్టుకునే క్రమంలో అందులో నుంచి మరో మొసలి రావడం ఎవరు ఊహించలేదు. అక్కడ ఉన్నవాళ్లను మింగేయాలి అనేంతాల ఆ మొసలి బయటకు దూసుకొచ్చింది. దీంతో పక్కన ఉన్నవాళ్లు గోడపైకి ఎక్కి..దాని నుంచి తప్పించుకున్నారు. చివరకు అటవీ అధికారులు రెండు మొసళ్లను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలేశారు. ఈ వీడియో ఏ ప్రాంతానికి చెందినదో ఇప్పటి వరకూ తెలియరాలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
OMG what are they doing there?😂pic.twitter.com/jhilcitIeY
— Figen (@TheFigen_) August 11, 2023
ఇదీ చదవండి: అప్పుడు రూ. 5 కోట్ల విన్నర్.. ఇప్పుడు పాలమ్ముకుంటున్నాడు! అసలేమైందంటే?