iDreamPost
android-app
ios-app

కూతురు పెళ్లి విషయంలో గొడవ.. తల్లి ఇంత పని చేస్తుందనుకోలేదు

  • Published Oct 03, 2023 | 11:14 AM Updated Updated Oct 03, 2023 | 11:14 AM
  • Published Oct 03, 2023 | 11:14 AMUpdated Oct 03, 2023 | 11:14 AM
కూతురు పెళ్లి విషయంలో గొడవ.. తల్లి ఇంత పని చేస్తుందనుకోలేదు

కూతురికి పెళ్లి చేయాలని పట్టుదలతో తండ్రి, ఆమెను చదివిద్దామని తల్లి గొడవ పడ్డారు. కుమార్తె వివాహంపై ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. కుమార్తెకు అంత వయస్సు ఏం అయిపోయిందని, చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడితే కూతురు భవిష్యత్ బాగుంటుందని ఆలోచన చేసింది తల్లి. మంచి సంబంధాలు వస్తున్నాయని, త్వరగా కూతురికి వివాహం చేసేయాలని తపన పడుతున్నాడు తండ్రి. ఈ విషయంపైనే కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణ భార్యా భర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరకు మనస్థాపం చెందిన భార్య.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలను తల్లి లేని అనాధను చేసి వెళ్లిపోయింది. తెలంగాణలోని జగిత్యాలో గుండ నరసింహులు ఇంట్లో విషాదం నెలకొంది.

పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన నరసింహులు, కవిత భార్యా భర్తలు. వీరికి పెళ్లి 20 సంవత్సరాలు కాగా, కుమార్తె, కూతురు ఉన్నారు. కాగా, కుమార్తె ప్రస్తుతం డిగ్రీ చదువుతుంది. ఆమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూసే ప్రయత్నం చేస్తున్నాడు నరసింహులు. కూతురుకి అప్పుడే పెళ్లి ఎందుకని, చదువుకోనివ్వాలని తల్లి కవిత భర్తతో గొడవ పడింది. ఈ విషయంపై వాదనకు దిగారు. తీవ్ర మనస్తాపానికి గురైన కవిత.. సోమవారం వేకువ జామున ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు తాళలేక కేకలు వేయడంతో భర్త, స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నించారు. కాలిన గాయాలతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన గురించి తెలిసిన పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş