Krishna Kowshik
పిల్లవాడు ఆడుకుంటూ పొరపాటున మేడ మీద నుండి పడిపోయాడని అనుకున్నారంతా. ఇక అప్పటి నుండి తల్లి మాత్రం మనో వేదనకు గురౌతుంది. నిద్ర పోతుంటే ఉలిక్కి పడటం, పిచ్చి పిచ్చి కలలు రావడం మొదలుపెట్టాయి. ఇదంతా కొడుకు చనిపోయిన డిప్రెషన్ అని భావించాడు భర్త.
పిల్లవాడు ఆడుకుంటూ పొరపాటున మేడ మీద నుండి పడిపోయాడని అనుకున్నారంతా. ఇక అప్పటి నుండి తల్లి మాత్రం మనో వేదనకు గురౌతుంది. నిద్ర పోతుంటే ఉలిక్కి పడటం, పిచ్చి పిచ్చి కలలు రావడం మొదలుపెట్టాయి. ఇదంతా కొడుకు చనిపోయిన డిప్రెషన్ అని భావించాడు భర్త.
Krishna Kowshik
బంగారం లాంటి కొడుకు నాలుగు నెలల క్రితం డాబా మీద నుండి ఆడుకుంటూ పడిపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు రెండు అంతస్థులపై నుండి పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు మరణించాడు బాలుడు. మూడేళ్ల వయస్సుకే నూరేళ్లు నిండిపోయాయని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంత అయ్యారు. పిల్లవాడు ఆడుకుంటూ పొరపాటున మేడ మీద నుండి పడిపోయాడని అనుకున్నారంతా. ఇక అప్పటి నుండి తల్లి మాత్రం మనో వేదనకు గురౌతుంది. నిద్ర పోతుంటే ఉలిక్కి పడటం, పిచ్చి పిచ్చి కలలు రావడం మొదలుపెట్టాయి. ఇదంతా కొడుకు చనిపోయిన డిప్రెషన్ అని భావించాడు భర్త. కానీ చివరకు ఆమె ఈ మానసిక పరిస్థితిని తట్టుకోలేక అసలు విషయం కక్కేయడంతో విస్తుపోవడం భర్త వంతైంది.
పొరిగింటి వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని కొడుకు చూశాడని.. మీకు ఎక్కడ చెప్పేస్తాడోనన్న భయంతో పిల్లవాడ్ని తనే మెడ మీద నుండి తోసి చంపేసినట్లు భర్తకు చెప్పింది. మానవ సమాజం తలదించుకునే ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానిస్టేబుల్ ధ్యాన్ సింగ్, భార్య జ్యోతి రాథోడ్, కుమారుడు జతిన్ రాథోడ్‌తో కలిసి ఓ కాలనీలో జీవిస్తున్నాడు. కాగా, భార్య జ్యోతి.. పొరిగింట్లో ఉండే ఉదయ్ ఇండోలియాతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం ఆమె భర్తకు తెలియదు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 28న ధ్యాన్ సింగ్ ఓ ప్లాస్టిక్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా అందరినీ ఆహ్వానించాడు. ఆ కార్యక్రమానికి ఉదయ్ కూడా వచ్చాడు. అందరూ ఫంక్షన్ హడావుడిలో ఉండగా.. జ్యోతి, ఉదయ్ ఓ డాబా మీదకు వెళ్లి సరస సల్లాపాల్లో మునిగి తేలారు. అయితే అమ్మను అనుసరించుకుంటూ మేడ మీదకు వచ్చాడు చిన్నారి జతిన్ అలియాస్ సన్నీ.
వీరిద్దరూ సన్నిహితంగా ఉండగా కుమారుడు చూశాడు. కుమారుడ్ని చూసిన తల్లి.. ఎక్కడ తండ్రికి చెప్పాడేమోనన్న భయంతో.. టెర్రస్ మీద నుండి తోసేసింది. రెండు అంతస్థుల మీద నుండి పడిపోవడంతో బాబు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడ్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించాడు. సన్నీ డాబా మీద ఆడుకుంటూ కాలు జారి పడిపోయాడంటూ అందరికి కట్టుకథలు అల్లింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులు అదే నిజమని నమ్మారు. అయితే అప్పటి నుండి ఆమెను నేరం చేశానన్న వేదన వెంటాడుతూనే ఉంది. దీంతో పాటు ఆమెకు పీడ కలలు రావడం ప్రారంభమయ్యాయి. తరచూ కుమారుడు కలలో కనిపించడంతో.. తాను తప్పుచేశానన్న భావం ఎక్కువై.. తన భర్త ముందు అసలు విషయాన్ని వెల్లడించింది. తన పాపాన్ని భర్త ముందు భళ్లున కక్కింది. దీంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. జ్యోతితో పాటు ఆమె ప్రియుడ్ని అరెస్టు చేశారు.