iDreamPost
android-app
ios-app

పిన్నిని అసభ్యంగా తాకిన అక్క కుమారుడు.. అతడు చేసిన పనికి

అంతర్జాలంలో అన్ని దొరికేయడంతో చెత్త వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కుర్రకారు. దీంతో కామ వాంఛతో రగిలిపోతున్నారు. కళ్లు మూసుకుపోయి వావి వరసలు మర్చిపోతున్నారు.

అంతర్జాలంలో అన్ని దొరికేయడంతో చెత్త వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కుర్రకారు. దీంతో కామ వాంఛతో రగిలిపోతున్నారు. కళ్లు మూసుకుపోయి వావి వరసలు మర్చిపోతున్నారు.

పిన్నిని అసభ్యంగా తాకిన అక్క కుమారుడు.. అతడు చేసిన పనికి

తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అన్ని విషయాలను గూగుల్ తల్లినో, యూట్యూబ్ మామనో అడిగి తెలుసుకుంటున్నారు నెటిజన్లు. కొంత మంది మంచి కోసం వినియోగిస్తుంటే.. మరికొందరు పెడదోవ పట్టి చెత్త చెత్త వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు సెల్ ఫోనులో మునిగి తేలుతున్నవారే. కానీ కౌమార దశలో ఉన్న పిల్లలు కొన్ని కొన్ని వెబ్ సైట్లకు ఎడిక్ట్ అయిపోయి.. చిన్నతనంలోనే ప్రేమ, పెళ్లి, సెక్స్ అంటూ సంభాషించుకుంటున్నారు. కామ వాంఛతో రగిలిపోతున్నారు. అంతేనా.. కొన్నిసార్లు పాడుపనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్కొక్కసారి వావి వరసలు కూడా మరిచిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు.

సొంత పిన్నిపై అత్యాచారానికి ప్రయత్నించగా.. ఆమె ప్రతి ఘటించడంతో గొంతు నులిమి చంపేశాడు అక్క కొడుకు. ఒళ్లు గగొర్పొడిచేలా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగడిలోని పేర్నే గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిలియూరులోని దర్ఖాసులో నివాసముంటున్న హేమావతి (37) ఆదివారం అర్థరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. గుండె పోటు అంటూ అక్క కొడుకు చెప్పసాగాడు. అయితే ఆమె పెనుగాడినట్లు గుర్తించడంతో పాటు కుమారుడు మొహంపై గాయాలు ఉండటంతో అతడి తండ్రి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. మైనర్ అబ్బాయిపై అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయాలు వెలుగు చూశాయి.

హేమావతి ఇంటికి వెళ్లాడు అక్క కొడుకు. అతడు 10వ తరగతి చదువుతున్నాడు. పిన్ని ఇంటికి వెళ్లిన అతడు.. ఆమె నిద్రపోయాక.. శారీరక వాంఛ తీర్చుకునేందుకు ఆమెను అసభ్యంగా తాకాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన పిన్ని.. ఏంటీ నువ్వు చేస్తున్న పని అంటూ మందలించింది. వెళ్లి నిద్రపో అంటూ తిట్టింది. అయితే తాను చేసిన పని గురించి.. అమ్మానాన్నలకు, ఇరుగుపొరుగుకు పిన్ని చెబుతుందని, తనకు అవమానం ఎదురౌతుందన్న భయంతో.. ఆమె నిద్రపోయిన కాసేపటికి ఆమె మంచం దగ్గరకు వెళ్లి.. మెడ నొక్కి ఊపిరాడకుండా చేశాడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నించే క్రమంలో అతడిపై మోహంపై చేయి పెట్టి గీరడంతో మైనర్ అబ్బాయికి గాయాలయ్యాయి. అనంతరం గుండెపోటుతో పిన్ని చనిపోయిందంటూ చెప్పసాగాడు. మెడపై గాయాలుండటంతో అతడి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. అబ్బాయితో నిజం కక్కించారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş