కరోనా పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. చైనా నుండి మరో 23 దేశాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో WHO(World health organisation) అత్యయిక స్థితి విధించింది. ఇప్పటికే సుమారు 426 మంది కరోనా వైరస్ వల్ల మృత్యు వాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా 20,438 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశంలోకి అడుగుపెట్టే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహించి వ్యాధి సోకిందా లేదా అని నిర్ధారణ చేస్తున్నారు. ఒకవేళ అనుమానిత లక్షణాలు ఉంటే వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్సలు నిర్వహిస్తున్నారు.
Read Also: కరోనాను భారత్ అడ్డుకోగలదా ?
మనదేశంలో కూడా కరోనా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయంలో చైనా హాంకాంగ్ విమానాల రాకపోకలను నిషేధించాయి.కరోనా వైరస్ వ్యాధి నిర్దారణ పరీక్షలన్నీ గాంధీ ఆసుపత్రిలోనే నిర్వహించేలా అనుమనుతులు రావడంతో గాంధీ ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో కరోనా వైరస్ తమకు సోకిందేమో అన్న అనుమానంతో 28 మంది అనుమానితులు గాంధీ హాస్పిటల్ లో చేరగా 20 మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. కాగా వీరిలో 19 మందికి రిపోర్టులు నెగెటివ్ గా వచ్చాయి. మరొకరికి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది.
Read Also: వణికిస్తున్న కరోనా…
విదేశాల నుండి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు విమానం దిగిన వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయంలోనే ప్రత్యేక గదుల్లో వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చైనా విమానాలను, చైనా ప్రయాణాలను పలు దేశాలు నిషేధం విధించాయి. కరోనా వైరస్ పై అపోహలను పుకార్లను వ్యాప్తి చేయొద్దని, వదంతులను నమ్మొద్దని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది కరోనా వైరస్ గురించి సామజిక మాధ్యమాల్లో వదంతులను వ్యాప్తి చేస్తుండడంతో అలాంటి వార్తలను నమ్మొద్దని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా విషయంలో ఏ వైద్య సహాయం కావాలన్నా, లేదా సలహా కావాలన్నా 040-24651119 హెల్ప్ లైన్ నంబర్ ను సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది..