డీసీజీఐ అనుమతితో.. హెటిరోలోగస్ బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ !

కరోనా వచ్చి రెండేళ్లయింది. కానీ ఇంకా దానిపట్ల ఉన్న భయం పోలేదు. దేశం, విదేశాల్లో కరోనా మరణాలు, కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ల ద్వారా కరోనాను అంతమొందించవచ్చని అనుకున్నారు కానీ.. సాధ్యపడలేదు. వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా కొందరికి కరోనా సోకిన విషయం తెలిసిందే. అందుకే బూస్టర్ డోస్ ను వేయాలని ప్రతిపాదించింది కేంద్రం. తొలుత 40 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసును అందించింది. ఆ తర్వాత ప్రైవేటు ఆస్పత్రుల్లో కొంత నగదు చెల్లించి బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించింది.

అయితే తొలి రెండు డోసులు ఏది తీసుకున్నారో బూస్టర్ డోస్ కూడా అదే తీసుకోవాలన్న నియమం ఉండేది. కానీ ఇప్పుడు ఒక భిన్న బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. అంటే తొలి రెండు డోసులు కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్ తీసుకున్నా బూస్టర్ డోస్ గా కార్బెవ్యాక్స్ ను తీసుకోవచ్చు. ఈ మేరకు డీసీజీఐ (భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతులు ఇచ్చింది. దేశంలోనే హెటిరోలోగస్ బూస్టర్ డోస్ (భిన్న బూస్టర్ డోస్) గా అనుమతి పొందిన తొలి సంస్థ తమదేనని కార్బెవ్యాక్స్ బయోలాజికల్ శనివారం ప్రకటించింది. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారు కోవాగ్జిన్‌ లేదా కోవిషీల్డ్‌ రెండు డోస్‌లు తీసుకున్న 6 నెలల వ్యవధి తర్వాత బూస్టర్‌డోస్‌గా కార్బెవ్యాక్స్‌ను తీసుకోవచ్చు.

 

Show comments