iDreamPost
android-app
ios-app

Eye Drops: కళ్ల జోడు కష్టాలకు చెక్.. ఐ డ్రాప్స్ ను ఆమోదించిన భారత ప్రభుత్వం

  • Published Sep 04, 2024 | 10:07 AM Updated Updated Sep 04, 2024 | 10:07 AM

DCGI-Eye Drops: కంటి సమస్యలకు చెక్ పెట్టే ఒక ఐ డ్రాప్స్ కు తాజాగా భారత ప్రభుత్వం ఆమోద తెలిపింది. ఆ వివరాలు..

DCGI-Eye Drops: కంటి సమస్యలకు చెక్ పెట్టే ఒక ఐ డ్రాప్స్ కు తాజాగా భారత ప్రభుత్వం ఆమోద తెలిపింది. ఆ వివరాలు..

  • Published Sep 04, 2024 | 10:07 AMUpdated Sep 04, 2024 | 10:07 AM
Eye Drops: కళ్ల జోడు కష్టాలకు చెక్.. ఐ డ్రాప్స్ ను ఆమోదించిన భారత ప్రభుత్వం

నేటి కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సర్వ సాధారణ సమస్య కంటి ప్రాబ్లం. మారుతున్న కాలం, ఉద్యోగ అవసరాల వల్ల రోజులో ఎక్కువ సమయం టీవీ, మొబైల్, కంప్యూటర్ స్క్రీన్ కే అంకితం కావాల్సిన పరిస్థితులు. ఇక పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు బాగా అలవాటు పడ్డారు. ఫలితంగా ఎక్కువ గంటలు స్క్రీన్ చూడటం వల్ల కళ్ల సమస్యల పెరుగుతున్నాయి. తలనొప్పి, సైట్ వంటి ప్రాబ్లమ్స్ అధికం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా భారత ప్రభుత్వం ఓ ఐ డ్రాప్స్ కు ఆమోదం తెలిపింది. దాంతో కళ్ల జోడు సమస్యకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఆవివరాలు..

కంటి సంబంధిత సమస్యలతో బాధపడేవారికి రీడింగ్ గ్లాసెస్‌ను అవసరం లేకుండా కంటి చూపును మెరుగు పరిచే ఐ డ్రాప్స్ కు భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) ఆమోదం తెలిపింది. ముంబైకి చెందిన ఈఎన్టీఓడీ ఫార్మాస్యూటికల్స్ ప్రెస్‌ బయోపియా చికిత్స కోసం ఈ కొత్త ఐ డ్రాప్స్‌ను తయారు చేసింది. వయసు పెరిగే కొద్దీ మనుషుల్లో ప్రెస్‌ బయోపియా అనే సమస్య తలెత్తుతుంది. దీని కారణంగా దగ్గరగా ఉన్న వస్తువులను చూడడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఇది సాధారణంగా 40వ ఏళ్ల వయసులో మొదలై 60 ఏళ్ల నాటికి తీవ్రంగా పరిణమిస్తుంది. ఫలితంగా రీడింగ్ గ్లాసెస్ వాడాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికే ప్రెస్‌వు ఐ డ్రాప్స్ ను ఉత్పత్తి చేశారు.  ప్రెస్ బయోపియా ఉన్నవారిలో రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తగ్గించడానికి భారత దేశంలో తయారైన మొట్ట మొదటి ఐ డ్రాప్స్ ఇదే కావడం విశేషం. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) ఉత్పత్తిని ముందుగా సిఫార్సు చేసిన తర్వాత ఈఎన్టీఓడీ ఫార్మాస్యూటికల్స్ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి తుది ఆమోదం పొందింది.

DCGI Approved PresVu Eye Drops 2

డీసీజీఐ నుంచి తుది ఆమోదం పొందిన తర్వాత ప్రెస్‌వు ఐ.. తయారీదారులు పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది కేవలం రీడింగ్ గ్లాసెస్ అవసరాన్ని తొలగించడమే కాకుండా కళ్లను తేమనుగా చేసే అదనపు ప్రయోజనాన్ని కూడా కలిగి ఉందని తెలిపారు. ప్రిస్ బయోపియా సమస్య ఉన్న వారికి, ఈ ఐ డ్రాప్ రీడింగ్ గ్లాసెస్ అవసరం లేకుండా దగ్గరి దృష్టిని పెంచే నాన్-ఇన్వాసివ్ ఎంపికను అందిస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారికి ఇది చాలా మంచి ఔషధం అంటున్నారు నిపుణులు.

ఈ సందర్భంగా ఈఎన్టీఓడీ ఫార్మాస్యూటికల్స్ సీఈవీ నిఖిల్ కే మసుర్కర్ మాట్లాడుతూ ప్రెస్ వూ అనేది కొన్ని సంవత్సరాల నిరంతర పరిశోధనల ఫలితం. దీని ద్వారా మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరచవచ్చు. అక్టోబర్ మొదటి వారం నుండి, ప్రిస్క్రిప్షన్ ఆధారితంగా ఈ ఐ డ్రాప్స్ అమ్మకాలు మొదలవుతాయి. రూ.350 ధరతో ఫార్మసీలలో అందుబాటులో ఉండనుందని చెప్పుకొచ్చారు.