ఎస్ఐను స్థంభానికి కట్టేసి.. బట్టలు ఊడదీసి కొట్టారు

శాంతి, భద్రతలను పరిరక్షిస్తూ.. సామాన్యులకు అండగా నిలవాల్సిన పోలీసులు.. వక్ర మార్గంలో వెళుతున్నారు. అమ్మాయిలను ఏడిపించే పోకిరీలను చీల్చి చెండాడాల్సిన రక్షక భటులు.. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. పీకల దాకా తప్పతాగి ఏం చేస్తున్నామో మరచి వ్యవహరిస్తున్నారు. చివరకు సామాన్యుల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు. తాజాగా ఓ ఎస్ఐ ఇటువంటి దుశ్చర్యకే పాల్పడితే.. ఊరంతా అతడికి బుద్ది చెప్పింది. తాగి.. ఇంటి పైకప్పు తొలగించి, నిద్ర పోతున్న బాలికపై అత్యాచారానికి ఒడిగట్టేందుకు ప్రయత్నింగా, ఆమె గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, ఇతరులు వచ్చి.. అతడిని స్థంభానికి కట్టి, వివస్త్రుడ్ని చేశారు. అంతటితో ఆగకుండా చితగొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ,

ఆగ్రాలో ఓ పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్‌ను స్థంభానికి కట్టి కొట్టిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సందీప్ కుమార్ రెండేళ్ల కింద ఎస్ఐ కొలువులో చేరారు. తప్పతాగి బర్హాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిహయ్య గ్రామంలో నివసిస్తున్న ఓ బాలిక ఇంటి పై కప్పు నుండి దూకి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆ ఇంట్లో అదే సమయంలో నిద్రిస్తున్న బాలిక వద్దకు వెళ్లి ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో.. వెంటనే స్థానికులు పరుగున వచ్చి ఎస్ఐను పట్టుకుని స్థంభానికి కట్టేశారు. అనంతరం బట్టలు విప్పి.. కర్రలతో దాడి చేశారు. అనంతరం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచార యత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు సందీప్ కుమార్ ను విధుల నుండి తప్పించారు.

Show comments