iDreamPost
android-app
ios-app

రైల్వే ట్రాక్ మీద భార్యపై బ్లేడ్ తో దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్

  • Published Sep 26, 2023 | 7:59 PM Updated Updated Sep 26, 2023 | 9:15 PM
  • Published Sep 26, 2023 | 7:59 PMUpdated Sep 26, 2023 | 9:15 PM
రైల్వే ట్రాక్ మీద భార్యపై బ్లేడ్ తో దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్

ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మనస్పర్థలు, కుటుంబంలోని ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత కారణాలతో షాకింగ్ నిర్ణయాలు తీసుకుని జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. ఇదే రీతిలో ఓ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవ ఆత్మహత్యాయత్నానికి దారితీసింది. వారి ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ ఏకంగా రైల్వే ట్రాక్ మీదకు భార్యను తీసుకొచ్చి ఆమెపై బ్లేడుతో దాడి చేసి తన క్రూరత్వన్ని ప్రదర్శిచాడు ఆమె భర్త. అంతటితో ఆగకుండా ట్రైన్ కింద భార్యను తోసేసి తాను ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ సమయంలోనే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి వారిద్దరిని కాపాడాడు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీలో ఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ పై ఓ యువకుడు తన భార్యపై బ్లేడ్ తో దాడి చేస్తూ తాను గాయపరుచుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏదో విషయంలో తలెత్తిన గొడవ కారణంగా భార్యను రైల్వే ట్రాక్ పైకి తీసుకొచ్చి అంతమొందించాలని చూశాడు తన భర్త. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లుగా తెలిసింది. అయితే ట్రాక్ పై బ్లేడుతో సైకో లాగా దాడికి పాల్పడుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న స్థానికులు వద్దని వారించినా వినలేదు. దగ్గరికి రావొద్దంటూ వారిని భయబ్రాంతులకు గురిచేశాడు. తన చేతిలో బ్లేడ్ ఉండడంతో అతడి వద్దకు వెళ్లడానికి ఎవరూ కూడా ధైర్యం చేయలేకపోయారు. ఈ క్రమంలో ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ట్రాక్ నుంచి పక్కుకు రావాలని అతడికి నచ్చజెప్పారు. వారి మాటలు ఆ వ్యక్తి వినలేదు.

ఇంతలోనే ఆ ట్రాక్ పై ట్రైన్ వస్తోంది. ఓ పక్క యువకుడి చేతిలో బ్లేడు, మరొపక్క కూత వేటు దూరంలో ట్రైన్.. సరిగ్గా ఈ సమయంలోనే ధైర్య సాహసాలు ప్రదర్శించాడు ఆ కానిస్టేబుల్. ట్రాక్ పై తన భార్యను పట్టుకుని ట్రైన్ కు ఎదురుగా వెళ్తున్న అతడిని వెంబడించి అతడి చేతుల్లో ఉన్న బ్లేడును కిందపడేలా చేశాడు కానిస్టేబుల్. ఆ తరువాత ఆ మహిళను రైల్వే ట్రాక్ నుంచి తప్పించి కాపాడాడు. ఆమె భర్తను ట్రైన్ వెళ్లేంత వరకు కానిస్టేబుల్ తో పాటు అక్కడున్న వారు పట్టుకుని అంబులెన్స్ కు సమాచారం అందించారు. క్షణం ఆలస్యమైనా ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసేవి. ఈ ఘటనలో కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ప్రాణాలకు తెగించి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. కానిస్టేబుల్ చూపిన తెగువకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetbetwooncasibomiptv satın alCasibom