iDreamPost
android-app
ios-app

పుష్ప2 లో శ్రీవల్లి ట్విస్ట్

  • Published Jun 21, 2022 | 1:19 PM Updated Updated Jun 21, 2022 | 1:19 PM
  • Published Jun 21, 2022 | 1:19 PMUpdated Jun 21, 2022 | 1:19 PM
పుష్ప2 లో శ్రీవల్లి ట్విస్ట్

ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే పుష్ప 2 ది రూల్ తాలూకు లీక్డ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మొదటి భాగానికి నార్త్ లో దక్కిన బ్రహ్మాండమైన ఫలితం చూశాక దర్శకుడు సుకుమార్ చాలా ఎక్కువ టైం తీసుకుని మరీ సీక్వెల్ కి స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ కూడా ఎంత ఆలస్యమైనా పర్వాలేదు కెజిఎఫ్ 2 రేంజ్ లో ఈ సెకండ్ పార్ట్ అవుట్ ఫుట్ ఉండాలనే నిశ్చయంతో ఉన్నాడు. ఒకవేళ హిందీలో పుష్ప 1 బ్లాక్ బస్టర్ కాకపోయి ఉంటే ఇప్పుడు లెక్కలు వేరుగా ఉండేవి. తెలుగు ఆడియన్స్ ని మాత్రమే టార్గెట్ చేసుకుని పూర్తి చేసేవారు, కానీ డిమాండ్ ఊహించని రీతిలో పెరిగిపోవడంతో చాలా మార్పులు చేయాల్సి వచ్చింది.

ఇక కొత్తగా వచ్చిన లీక్ ప్రకారం చూస్తే ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న చేసిన శ్రీవల్లి క్యారెక్టర్ ని సెకండ్ హాఫ్ లో చంపేస్తారనే ప్రచారం జరుగుతోంది. పుష్పరాజ్ ని ఏం చేయలేక అతని బలహీనతను దెబ్బ కొట్టేందుకు శత్రువులంతా ఒక్కటై ఆమెను మర్డర్ చేసే స్కెచ్ వేస్తారట. ముఖ్యంగా తన వల్ల కాళ్ళు చేతులు విరగొట్టుకున్నధనుంజయ్ క్యారెక్టర్ ఇందులో కీలకంగా ఉంటుందని తెలిసింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే ఇదో రొటీన్ ట్విస్ట్ అవుతుంది. చాలా సినిమాల్లో ఇలా హీరో భార్యను చంపగానే మనోడు ఉగ్రరూపం దాల్చి ఒక్కొక్కరిని చంపేయడం వందల వేల సార్లు చూశాం. మరి సుక్కు అంత రొటీన్ గా ఆలోచించాడా అంటే చెప్పలేం.

ఎక్కడి దాకో ఎందుకు కెజిఎఫ్ 2లో జరిగింది ఇదే. అయినా కూడా ఆడియన్స్ ఆదరించారు. కాకపోతే అందులో హీరోయిన్ కి మరీ ఎక్కువ ప్రాధాన్యం లేకపోవడంతో అదేమంత సమస్య కాలేదు. కానీ పుష్పలో అలా కాదు. శ్రీవల్లిని పుష్ప రాజ్ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఆ కోణంలో చూసుకుంటే శ్రీవల్లిని చంపేయడం కరెక్టే కానీ సుక్కు మనసులో ఏముందో తెలియాల్సి ఉంది. పుష్ప 2 జూలై నుంచి మొదలుకానుంది. 2023 సమ్మర్ గిఫ్ట్ గా ప్లాన్ చేసుకున్నారు కానీ ఖచ్చితంగా ఆ డేట్ కే కట్టుబడి ఉంటారని చెప్పలేం. ఒకవేళ అంతకన్నా ఎక్కువ గ్యాప్ వస్తే మాత్రం బాహుబలి, కెజిఎఫ్ తరహాలో ఆ రేంజ్ బజ్ ని మైంటైన్ చేయాల్సి ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet