iDreamPost
android-app
ios-app

కమాండర్ బిగ్ బాస్ – మిలిటరీ టాస్కులు

  • Published Nov 18, 2020 | 7:31 AM Updated Updated Nov 18, 2020 | 7:31 AM
కమాండర్ బిగ్ బాస్ – మిలిటరీ టాస్కులు

సోమావారం నుంచి కొత్తగా నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో సభ్యుల టెంపో పెరుగుతోంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇంకో నెల రోజులు బయటికి వెళ్లకుండా గట్టిగా ప్రయత్నిస్తే టైటిల్ రేస్ లో ఉండొచ్చనే ఆలోచనతో మంచి ఎత్తుగడలే వేస్తున్నారు. డ్రామా పాలు గురించి ఎన్ని కామెంట్లు వస్తున్నా రేటింగ్స్ వచ్చేందుకు ఇదే బెస్ట్ స్ట్రాటజీ అనే తరహాలో ఉన్నారు నిర్వాహకులు. ఇక నిన్నటి సంగతి చూస్తే బిగ్ బాస్ హౌస్ ని కమాండో శిబిరంగా మార్చేశారు. దీనికి కూడా కెప్టెన్ గా అఖిలే ఉంటాడని ఇందులో భాగంగా కొన్ని డ్రిల్స్ లాంటివి చేయాల్సి ఉంటుందని ముందే స్పష్టం చేశాడు. మిలిటరీ తరహాలో టాస్కులు ప్లాన్ చేశారు.

డ్రిల్స్ చేయడం, పాకడంలో చాలా యాక్టివ్ గా ఉన్న సోహైల్ వెయిట్ ఛాలెంజ్ లో మాత్రం కొద్దిలో ఓడిపోయాడు. ఒక్క వెయిట్ ని స్విమ్మింగ్ పూల్ అవతలికి చేర్చాల్సి ఉండగా ఐదు నిమిషాల టైం అయిపోవడంతో మిస్ అయ్యాడు. అయితే ఫలితం రానందుకు చాలా ఎమోషనల్ అయ్యాడు. మెహబూబ్ ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. పోల్ ని కౌగలించుకుని కాళ్ళు చేతులు కింద పెట్టకుండా చేసే టాస్కును అఖిల్ ఎట్టకేలకు ఫినిష్ చేశాడు. వీటికి అటెండ్ అవ్వడానికి ముందు బజర్ నొక్కే నిబంధన కూడా పెట్టారు. ఈ క్రమంలోనే హారిక తనమీద అలిగిన అభిజిత్ కు హగ్ ఇచ్చింది. బాబు మురిసిపోయాడు కూడా.

అభిజిత్ ,మంకీ బార్ టాస్క్ కి రెడీ అయ్యాడు. హారిక టీజ్ చేస్తున్నా పది నిముషాలు గాల్లోనే నిలబడి పూర్తి చేశాడు. ఇక చివరి టాస్కైన టైర్ మోసుకొవడాన్ని హారిక తీసుకుంది. ఊహించని విధంగా అంత పెద్ద టైర్ ని ఇచ్చిన టైం కంటే అరవై సెకండ్లు తక్కువలో కేవలం తొమ్మిది నిమిషాల్లోనే పది రౌండ్లు టైర్ ని దొర్లించి సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత అఖిల్ పుట్టినరోజు వేడుకలను అందరూ కలిసి చేసుకున్నారు. ఇక బాబు బర్త్ డే కావడంతో మోనాల్ మళ్ళీ తనలో రొమాంటిక్ యాంగిల్ ని బయటికి తీసి అఖిల్ ని అర్ధరాత్రి ముద్దుల్లో ముంచెత్తింది. దీనికి అతగాడు ఇలా అయితే రోజు పుట్టినరోజు రావాలని కోరుకోవడం అసలు ట్విస్టు

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş