Arjun Suravaram
అంతేకాక వారి నేరాన్ని బట్టి ఒక రోజు నుంచి నెలల తరబడి లాకప్ లో ఉంచుతారు. ఇలా పోలీస్ స్టేషన్లలో కేవలం మనషులను మాత్రమే అరెస్ట్ చేసి.. లాకప్ లో ఉంచుతారు. కానీ ఓ పోలీస్ స్టేషన్లో మూగజీవాన్ని కూడా లాకప్ లో ఉంచారు.
అంతేకాక వారి నేరాన్ని బట్టి ఒక రోజు నుంచి నెలల తరబడి లాకప్ లో ఉంచుతారు. ఇలా పోలీస్ స్టేషన్లలో కేవలం మనషులను మాత్రమే అరెస్ట్ చేసి.. లాకప్ లో ఉంచుతారు. కానీ ఓ పోలీస్ స్టేషన్లో మూగజీవాన్ని కూడా లాకప్ లో ఉంచారు.
Arjun Suravaram
సాధారణంగా ఎవరైన దొంగతనాలు చేసిన, గొడవలకు దిగిన, ఇతర దాడులకు పాల్పడిన.. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అంతేకాక వారి నేరాన్ని బట్టి ఒక రోజు నుంచి నెలల తరబడి లాకప్ లో ఉంచుతారు. ఇలా పోలీస్ స్టేషన్లలో కేవలం మనషులను మాత్రమే అరెస్ట్ చేసి.. లాకప్ లో ఉంచుతారు. కానీ ఓ పోలీస్ స్టేషన్లో మూగజీవాన్ని కూడా లాకప్ లో ఉంచారు. కోడిపుంజున్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు.. రెండు రోజులుగా లాకప్ లో ఉంచారు. నన్ను బయటకి వదలండి అని కొక్కొరకో అంటూ శబ్దాలు చేస్తుంది. అయినా దానిని పోలీసులు విడిచి పెట్టలేదు. ఇంతకు అది చేసిన తప్పు ఏమిటి.. అసలు ఈ వింత ఘటన ఎక్కడ జరిగింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని బురెడ్డి పల్లి పరిసర ప్రాంతాల్లో తరచూగా నాటు కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు సైతం ఈ నాటు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు నిఘ పెట్టారు. ఇదే క్రమంలో కరివేన గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్ల దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తితో పాటు కోడి పుంజును రెండు రోజుల క్రితం పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అయితే కోడి పుంజు కోసం ఎవరూ రాలేదు. దీంతో దానిని బయట వదిలేస్తే కుక్కులు తినే ప్రమాదం ఉందని పుంజును లాకప్ లో కట్టేసి.. ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. ఇక ఆ కోడి పుంజు తాను చేయని తప్పుకు రెండు రోజులుగా లాకప్ లోనే ఉండి పోయింది.
రెండు రోజులుగా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో కోడి పుంజుకు గింజలు వేస్తున్నారు. అది గింజలు తింటూ కొక్కరకో అంటూ కూతలు పెడుతుంది. ఇక వివిధ కేసులపై పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలు లాకప్ లో ఉన్న కోడిపుంజును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం తెలియక ..చాలా మంది కోడి ఏం తప్పు చేసిందా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దొంగకు దొరకడమే తాను చేసిన తప్పని కోడిపుంజు బాధపడొచ్చని.. దానిని చూసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి దొంగకు చిక్కిన కోడిపుంజు మాంసంగా మార్సాలింది పోయి.. దర్జగా పోలీస్టేషన్ల్ లో పోలీసులు చేతనే ఆహారం పెట్టించుకుని కూతలు కూస్తుంది. మరి.. ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: APలో ఘోర ప్రమాదం.. కాల్వలో పడినపెళ్లి బస్సు.. ఏడుగురు మృతి!