iDreamPost
android-app
ios-app

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఈ నెల 27న ముఖ్య సమావేశం..

  • Published Apr 25, 2022 | 9:49 AM Updated Updated Apr 25, 2022 | 10:35 AM
  • Published Apr 25, 2022 | 9:49 AMUpdated Apr 25, 2022 | 10:35 AM
సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఈ నెల 27న ముఖ్య సమావేశం..

ఏపీలో ఎన్నికలకు ఇప్పటినుంచే సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవలే రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేశారు. అంతేగాకుండా కొత్త జిల్లాలు ఏర్పాటుచేసి వాటికి పార్టీ అధ్యక్షులను నియమించారు. రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించారు. ప్రతిపక్షాల విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తున్నారు. వచ్చే నెల నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసిన జగన్.. అందుకు అనుగుణంగా ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రీజినల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ వ్యూహాలపై నేతలకు ఆయన దిశానిర్ధేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఉండబోతోంది. ఈ సమావేశం కీలకంగా భావిస్తున్నారు. మే 2వ తేదీ నుంచి గడపగడపకు వైసీపీ ప్రభుత్వం అంటూ వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. 2024లోపు.. పార్టీ మరింత బలోపేతం కావాలని, అందుకు అనుగుణంగా త్వరలోనే క్షేత్రస్థాయిలో సీఎం జగన్ పర్యటించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీన జరిగే సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, మంత్రులు ప్రజల్లోకి వెళ్లడంపై సీఎం జగన్ దిశానిర్ధేశం చేయబోతున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet