iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది YS రాజశేఖర్ రెడ్డే: CM రేవంత్

  • Published Mar 07, 2024 | 8:36 PM Updated Updated Mar 07, 2024 | 8:36 PM

CM Revanth On YSR Devlopment: హైదరాబాద్ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసింది.. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది వైఎస్సార్ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

CM Revanth On YSR Devlopment: హైదరాబాద్ భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసింది.. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది వైఎస్సార్ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

  • Published Mar 07, 2024 | 8:36 PMUpdated Mar 07, 2024 | 8:36 PM
హైదరాబాద్ కి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది YS రాజశేఖర్ రెడ్డే: CM రేవంత్

హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు గురించి అందరికీ తెలిసిందే. ఏ సెక్టార్ తీసుకున్నా అందులో హైదరాబాద్ పేరు ఉంటుంది. ఈ నగరం ఇతంటి భాగ్యానగరంగా మారడానికి కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయం ఎవరో చెప్పింది కాదు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. హైదరాబాద్ కు అందర్జాతీయ గుర్తింపు దక్కింతి అంటే అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్- రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్స్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ సభలో సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సాధారణంగా హైదరాబాద్ అనగానే ఐటీ అంటాం. ఆ ఐటీ పరిశ్రమను తీసుకొచ్చింది నేనే అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆ ఘనతను ఆయనకు ఎవరూ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్వయంగా ఆయనకు ఆయనే ఇచ్చేసుకుంటారు. కానీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో ఆ ఘనత ఎవరికి దక్కుతుంది అనే విషయంపై క్లారిటీ అయితే వచ్చేసింది. హైదరాబాద్ కి అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది అంటే అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ సభా ముఖంగా ప్రకటించారు.

“నేను ఒక మాట గుర్తుజేయదలుచుకున్నా. ఇవాళ హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది అటే.. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, ఐటీ కంపెనీలను, ఫార్మా కంపెనీలను, ఉద్ధృతంగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తేనే ఈ నగరానికి ఈనాడు అంతర్జాతీయ స్థాయి వచ్చింది. ఆనాడు అంతర్జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది” అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణ రాష్ట్ర సీఎం స్వయంగా చెప్పిన తర్వాత.. ఈ విషయంపై ఎలాంటి డిస్కషన్స్ ఉండాల్సిన అవసరం లేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలైపపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet