సీఎం జగన్ వద్దకు సీఎం రమేష్

రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత సీఎం రమేష్‌ ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా సీఎం జగన్‌ను సీఎం రమేష్‌ దంపతులు ఆహ్వానించారు. ఈ మేరకు తాడేపల్లిలో ఆయన్ను కలిసి శుభలేఖను అందించారు. ఇటీవల సీఎం రమేష్‌ కుమారుడి నిశ్ఛితార్థం దుబాయ్‌లో జరిగిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, గరిగపాటి రామ్మోహన్‌ రావు, టీజీ వెంకటేష్‌లు టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై బీజేపీలో చేశారు. టీడీపీలో ముఖ్యనేతలుగా, ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలను చూసుకునే సీఎం రమేష్, సుజనా చౌదరిలు బీజేపీలో చేరిన తర్వాత భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ మారినా కూడా సుజనా చౌదరి టీడీపీ బాణి వినిపిస్తుండగా సీఎం రమేష్‌ మాత్రం అన్ని పార్టీల వారితో సఖ్యత కోసం ప్రయత్నిస్తున్నారు. దుబాయ్‌లో జరిగిన సీఎం రమేష్‌ కుమారుడి నిశ్ఛితార్థానికి నారా లోకేష్‌ హాజరయ్యారు. తాజాగా వివాహానానికి సీఎం వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు.

Show comments