iDreamPost
android-app
ios-app

సీఎం ‘ఆదేశాలు భేఖాతర్ – అసలేం జరిగిందంటే..

సీఎం ‘ఆదేశాలు భేఖాతర్ – అసలేం జరిగిందంటే..

మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి వారిని లైంగికంగా వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరగకుండా పటిష్టమైన భద్రతను తీసుకోవాలని పోలీసులకు, అధికారులకు స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇందులో బాగంగానే ‘దిశ’ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మన్నలనే కాకుండా యావత్‌ దేశ ప్రజల మన్నలను అందుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. అయితే దిశ చట్టానిన్నికొందరు అధికారులు, పోలీసులు భేఖాతర్ చేస్తున్నారు.

తాడిపత్రి పట్టణంలోని ప్రకాశం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నటరాజ్‌ తోటి ఉపాధ్యాయులను లైంగికంగా వేధించారు. దీనిపై గత ఏడాది డిసెంబర్‌ 9న పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు లైంగికంగా వేధింపులపై కేసు రిజిష్టర్‌ అయింది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీసులు కీచకోపాధ్యాయునిపై చర్యలకు మాత్రం ఉపక్రమించలేదు. అప్పటి నుంచి మెడికల్‌ లీవుపై వెళ్లిన నటరాజ్‌.. ఉన్నట్లుండి శనివారం పాఠశాలలో ప్రత్యక్షమయ్యాడు.

సాధారణంగా మున్సిపల్‌ పరిధిలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు మెడికల్‌ లీవుపై వెళ్ళి వచ్చిన తరువాత తిరిగి తన విధుల్లోకి హాజరుకావాలంటే ముందుగా స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌కు తన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ అందజేసి ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుని నుండి భాద్యతలను స్వీకరించాల్సి ఉంది. కానీ అందుకు విరుద్ధంగా శనివారం ఉదయం కీచకోపాధ్యాయుడు నటరాజ్‌ పాఠశాలలో విధులకు హాజరవడంతో అక్కడున్న ఉపాధ్యాయులు అవాక్కైయ్యారు. మీడియాకు చూసి అక్కడి నుంచి పరారైన నటరాజ్‌ .. ఆదివారం ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసులో ముందస్తు బెయిల్‌ పొంది స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు.