iDreamPost
android-app
ios-app

Amarnath ఏంటీ జ‌ల‌విల‌యం?

  • Published Jul 08, 2022 | 8:35 PM Updated Updated Dec 19, 2023 | 5:58 PM

గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. టెంట్లు మునిగిపోయారు. ఇప్పటిదాకా 10 మంది చ‌నిపోయారు.

గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. టెంట్లు మునిగిపోయారు. ఇప్పటిదాకా 10 మంది చ‌నిపోయారు.

Amarnath ఏంటీ జ‌ల‌విల‌యం?

కొద్దిగా వ‌ర్షాలు అనుకున్న‌వేళ శుక్రవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టితో జమ్ముకశ్మీర్‌ అమర్‌నాథ్‌ యాత్ర, భోలేనాథ్‌ గుహ సమీపంలోనే ఆకస్మిక వరద పోటెత్తింది. గుహ పరిసరాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది. టెంట్లు మునిగిపోయారు. ఇప్పటిదాకా 10 మంది చ‌నిపోయారు.

ఒక్క‌సారిగా సాయంత్రం 5.30నిమ‌షాల‌కు కుండ‌పోత వ‌ర్షం మొద‌లైంది. ఆకాశం బ‌ద్ధ‌లైంది 2 కిలోమీటర్ల మేర వరద ఒక్కసారిగా కొండపై నుంచి కిందకు దూకింద‌ని సాక్ష్యులు చెబుతున్నారు. టెంట్లు, రూట్లు, చివ‌ర‌కు యాత్రికుల‌కు ఆహారాన్ని సిద్ధంచేసే ప్రాంతంకూడా వ‌రద‌నీటిలో చిక్కుకుంది.

Amarnath is a waterfall

ఆగ‌స్ట్ 11న ఈ యాత్ర ముగియ‌నుంది. ప్ర‌స్తుత వ‌ర‌ద‌తో యాత్ర‌ను తాత్కాలికంగా నిలుపుద‌ల చేశారు. వ‌ర‌ద‌ల్లో గాయ‌ప‌డిన‌వారిని హెలికాప్ట‌ర్ల‌లో త‌ర‌లిస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర‌, కేంద్ర విప‌త్తు ద‌ళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాయి. వాతావ‌ర‌ణం బాగాలోదేని అమ‌ర్ నాథ్ యాత్రను ఈ వారంలోనే నిలుపుద‌ల చేశారు.

వర్షం తగ్గడంతో.. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు లైట్ల వెలుతురులో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తోంది.