iDreamPost
iDreamPost
ఈ నెలలో పెద్ద సినిమాలు ఏవి వస్తాయనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది కానీ వచ్చే నెల వినాయక చవితిని మాత్రం మనవాళ్ళు గట్టిగానే టార్గెట్ చేయబోతున్నారు. థియేటర్లు తెరుచుకుని జనం వచ్చేందుకు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయిలో నాలుగు షోలతో ఎలాంటి నిబంధనలు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు సాధారణం అవుతాయనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఇది జరిగాక వచ్చే మొదటి పండగ వినాయకుడిదే. అందులోనూ ఫెస్టివల్ శుక్రవారం రాబోతోంది. కరెక్ట్ గా వర్కౌట్ అయితే మూడు రోజులు కలెక్షన్లను భారీగా చూసుకోవచ్చు. అఫ్కోర్స్ టాక్ బాగుంటేనే సుమా.
లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం గోపిచంద్ సీటిమార్, నాగ చైతన్య లవ్ స్టోరీలు సెప్టెంబర్ 9, 10 తేదీలను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. ఇప్పటికే ఇవి చాలా ఆలస్యమయ్యాయి. గోపీచంద్ సినిమా గురించి ఓటిటి ప్రచారం జరిగింది కానీ మళ్ళీ మేకర్స్ వెనక్కు తగ్గారని నిన్నటి నుంచి కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి సీటిమార్ ఆగస్ట్ 27కె ట్రై చేస్తున్నారట. కానీ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇంకేవో కొన్ని సెటిల్ కావడం బ్యాలన్స్ ఉండటంతో ఆలస్యమవ్వొచ్చని అంటున్నారు. అసలు వీటికి సంబంధించిన క్లారిటీ రావాలంటే నిర్మాతలు చెబితే కానీ స్పష్టత వచ్చే అవకాశాలు లేవు.
ఒకవేళ ఇది నిజమైతే కబడ్డీతో ప్రేమ కథ పోటీ పడబోతోందని చెప్పొచ్చు. అక్టోబర్ లో ఆర్ఆర్ఆర్ తో పాటు అఖండ, ఆచార్య లాంటి పాన్ ఇండియా సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఆలోగానే ఇలాంటి మీడియం రేంజ్ మూవీస్ గ్రౌండ్ ని క్లియర్ చేసుకోవడం మంచిది. లేకపోతే లేనిపోని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. థర్డ్ వేవ్ గురించి ప్రచారం ప్రస్తుతానికి వాస్తవ రూపం దాల్చలేదు కాబట్టి ఇప్పటికైతే అంతా నార్మల్ గానే ఉంది. దేశం మొత్తం మీద బాక్సాఫీస్ ముందు కుదుట పడింది టాలీవుడ్ లోనే. ఇక్కడ వస్తున్నన్ని రిలీజులు ఇంకెందులోనూ లేవు. అందుకే అనేది తెలుగువాడి సినిమా ప్రేమ వెలకట్టలేనిది
Also Read : ఈ కన్ఫ్యూజన్ ఏంటి నాని ?