iDreamPost
android-app
ios-app

రతన్ టాటా లవర్ సిమీ గరేవాల్ ఎవరు? పెళ్లి చేసుకోలేదు ఎందుకు?

  • Published Oct 16, 2024 | 4:02 PM Updated Updated Oct 16, 2024 | 4:02 PM

Actress Simi Garewal: ప్రముఖ వ్యాపార వేత్త,టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా తీవ్ర అనారోగ్య కారణంగా ముంబైలో అక్టోబర్ 9 తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం, భారతీయ వ్యాపార రంగంలో రతన్ టాటా ఒక ఐకాన్ అని చెప్పొచ్చు.

Actress Simi Garewal: ప్రముఖ వ్యాపార వేత్త,టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా తీవ్ర అనారోగ్య కారణంగా ముంబైలో అక్టోబర్ 9 తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం, భారతీయ వ్యాపార రంగంలో రతన్ టాటా ఒక ఐకాన్ అని చెప్పొచ్చు.

రతన్ టాటా లవర్ సిమీ గరేవాల్ ఎవరు? పెళ్లి చేసుకోలేదు ఎందుకు?

ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(86) అనారోగ్యంతో అక్టోబర్ 9న కన్నుమూసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అదే సమయంలో ఎక్స్ (ట్విట్టర్) లో ఓ వార్త సంచలనంగా మారింది. అదే నాటి అందాల తార సిమీ గరేవాల్ చేసిన ట్విట్. రతన్ టాటా మరణంపై ఆమె చేసిన ట్విట్ ఎంతో ఎమోషనల్ అనిపించింది. ఈ సందర్భంగా కొన్నేళ్ళ క్రితం రతన్ టాటాను ఇంటర్వ్యూ చేసిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో కింద ‘మీరు వెళ్లిపోయారని అందరూ అంటున్నారు.. మీరు లేని శూన్యం భరించడం చాలా కష్టం. వీడ్కోలు మిత్రమా.. రతన్ టాటా ’అంటూ పోస్ట్ చేశారు. అంతే ఈ పోస్ట్ నెట్టింట ఒక్కసారే వైరల్ గా మారింది.

ఇక 1970లో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సిమీ గరేవాల్.  రతన్ టాటాతో చాలా కాలం రిలేషన్ ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేసింది సిమీ.  ఆ డేట్ నా జీవితంలో మర్చిపోలేనిది.  ఆయన అంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా డబ్బుపై వ్యామోహం లేదు. మృదు స్వభావి, ఒక తాత్వికవేత్త, జంతు ప్రేమికుడు. ఆయనతో కొద్దిసేపు గడిపితే చాలు ప్రపంచాన్ని మర్చిపోతాం. అంటై కామెంట్స్ చేసింది. ఇక షమీ కామెంట్స్ తర్వాత  ఆయన జీవింతో మరో మహిళ ఉందాన్ని అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆయన కూడా ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. గతంలో సిమీ గరేవాల్ టెలివిజన్ షోలో రతన్ టాటాను ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ సందర్భంగా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు తర్వాత ఎన్నో ఇంటర్వ్యూల్లో ఆయన అసలు తన ప్రేమ, పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు రతన్ టాటా.  మరి అంతగా ప్రేమించినప్పటికీ ఆమెను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అన్న విషయం గురించి తెలుసుకుందాం.

ఇక సిమీ గరేవాల్ విషయానికి వస్తే.. 1940 అక్టోబరు 17, లూథియానాలో జన్మించింది. ఈమె తాత కెప్టెన్ కర్హార్ సింగ్ గరేవాలా.  సైన్యంలో యోధుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన వీరత్వాన్ని మెచ్చి విక్టోరియా మహరాణి ఓ ఖడ్గం బహుమతిగా ఇచ్చింది. సిమీ గరేవాల్ తండ్రి జె ఎస్ గరేవాల్ సైతం తండ్రి బాటలో నడిచారు. భారత సైన్యంలో బ్రిగేడియర్ గా పనిచేశారు.  వీరికి లండన్ లో పెద్ద ఇల్లు ఉంది. సిమీ గరేవాల్ తన ఐదేళ్ళ వయసులో లండన్ వెళ్లింది. అక్కడే తన విద్యాభ్యాసం కొనసాగించింది. రాజ్ కపూర్ నటించిన ‘ఆవారా’ మూవీ చూసిన సిమీ గరేవాల్ కి ఇండస్ట్రీపై మోజు పుట్టింది. 17ఏళ్ల వయసులో తాను హీరోయిన్ అవుతానని తల్లిదండ్రులకు చెప్పింది. మొదట తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.. కానీ కూతురు ఇష్టానికి తలొగ్గాల్సి వచ్చింది. భారత్ కి వచ్చిన ఆమె  జామ్‌నగర్ మహారాజాతో ప్రేమాయణం కొనసాగించింది. అలా జామ్ నగర్ మహరాజ పుణ్యమా అని బాలీవుడ్ నటీనటులు, దర్శక, నిర్మాతలతో పరిచయాలు ఏర్పడ్డాయి. మొత్తానికి జామ్ నగర్ మహరాజు సిఫార్సు, ఆడిషన్స్ తర్వాత తనకు ఇష్టమైన హీరో రాజ్ కపూర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అలా ఆమె చిన్న వయసులోనే హీరోయిన్ గా వరుస ఛాన్సులతో దూసుకు వెళ్లింది.  లిప్ లాక్ సీన్లు, బికినీలు ధరించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది.

అప్పట్లో సిమీ గరేవాల్ పరిచయం, ప్రేమ కోసం సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు పోటీ పడేవారు. బాలీవుడ్ లో సిమీ గరేవాల్ తన అందచందాలతో ఎంతోమంది సెలబ్రెటీలను తన చుట్టూ తిప్పుకుందని.. ఎంతోమంది కాపురాలు కూల్చిందని అనేవారు. పలువురు హీరోలతో ఆమె సీక్రెట్ గా రిలేషన్ మెయింటేన్ చేసిందని ఇండస్ట్రీ టాక్.  అలాంటి సమయంలో ఓ పార్టీలో రతన్ టాటా కు పరిచయం అయ్యింది సిమీ గరేవాల్. ఆ పరిచయం‌తో వీరిద్దరూ కొంత కాలం రహస్యంగా డేటింగ్ చేసినట్లు సమాచారం.  అదే సమయంలో రతన్ టాటా వ్యాపారాల్లో పలు వ్యాపారాల్లో బిజీగా ఉండేవారు.  అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది.  ఆ తర్వాత ఢిల్లీకి చెందిన రవి మోహన్ ని 1970లో పెళ్లి చేసుకుంది. 1979 లో విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సిమీ గరేవాల్ తన సోదరితో కలిసి ఉంటుంది. ఆమె జీవితంలో ఎంతోమంది బాయ్ ఫ్రెండ్ ఉన్నా.. రతన్ టాటా స్థానం చాలా గొప్పదిగా భావించింది. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా ప్రస్తావించింది. కానీ రతన్ టాటా మాత్రం ఈ విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అయితే రతన్ టాటా – సిమీ గరేవాల్ గురించి ఎంతో మంది ఎన్నో రకాల వార్తా కథనాలు రాశారు. కానీ ఎవరూ ఈ విషయాన్ని ధృవీకరించలేకపోయారు. చాలా ఏళ్ల తర్వాత ఓ ఇంటర్వ్యూలో రతన్ టాటాతో ఉన్న రిలేషన్ గురించి చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది సిమీ. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా అన్ని రంగాల్లో తన చెదరని ముద్ర వేశారు సిమీ గరేవాల్. మొదటి ప్రియురాలు తర్వాత సిమీ గరేవాల్ తో ఎక్కువ ప్రేమలో ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేకపోయారు రతన్ టాటా.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetMeritkingGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobetjojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetnakitbahiscasibomcasibomjojobetgrandpashabetcasibomgrandpashabet girişbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabet