iDreamPost
iDreamPost
థియేటర్లు తెరుచుకున్నాయి. వచ్చిన అయిదు సినిమాల్లో ఒకటి పర్వాలేదు అనిపించుకోగా మిగిలిన నాలుగు సోసో ఫలితాలనే అందుకున్నాయి. ఇప్పుడు ఆరో తేదీన మరికొన్ని రాబోతున్నాయి కానీ కాస్త ఎక్కువ బజ్ ఉన్నది మాత్రం ఒక్క ఎస్ఆర్ కల్యాణ మండపానికి మాత్రమే. దీనికి ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తున్నారు. ఒకవేళ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఏపిలో సగం అక్యుపెన్సీ లాంటి నిబంధనలు కలెక్షన్ల పరంగా పెద్దగా ఇబ్బంది కాబోదు. ఆ తర్వాత వచ్చే తేదీ 13. ఇది ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల్లో హాట్ డేట్ గా మారింది. ఇంకా పది రోజులే సమయం ఉన్నప్పటికి పెద్ద నిర్మాతలెవరూ అధికారికంగా ఎవరూ ఆ డేట్ కి వస్తామని పక్కాగా చెప్పలేదు.
నాని టక్ జగదీశ్ వస్తే ఎలా ఉంటుందన్న చర్చలు ప్రస్తుతానికి జరుగుతున్నాయని తెలిసింది. ఒకవేళ అది సాధ్యం కాదు అనుకుంటే విశ్వక్ సేన్ పాగల్ కూడా ఈ ఆప్షన్ ను వాడుకోవచ్చు. ఆ సమయానికి ఏపిలో నైట్ కర్ఫ్యూ, టికెట్ల సవరణ లాంటి సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు నమ్మకంగా ఉన్నారు. ఇవి వద్దనుకుంటే సంపూర్ణేష్ బాబు బజారు రౌడీ బరిలో దిగేందుకు సిద్ధంగా ఉంది. కన్ఫర్మ్ చేసుకున్న వాటిలో పూర్ణ నటించిన సుందరి, చైతన్యం, ఒరేయ్ బామ్మర్ది అనే మరో రెండు బడ్జెట్ మూవీ ఉన్నాయి కానీ వాటి మీద ఆశలు కానీ అంచనాలు కానీ ఎవరికీ లేవు. ఏదో అద్భుతం జరిగితే తప్ప
ఇక్కడ అసలు సమస్య చాలా కీలకమైన స్వతంత్ర దినోత్సవాన్ని మిస్ చేసుకోవడం. ఇప్పటికే థియేటర్లకు కలెక్షన్లు తగ్గిపోయాయి. తిమ్మరుసు, ఇష్క్ లకు వీక్ డేస్ లోనూ బలంగా నడిచేంత విషయం వాటిలో లేదు. అందుకే ఇంకా కొత్త సినిమాలు రావాలి. ఆర్ నారాయణమూర్తి రైతన్న కూడా 15న వచ్చే ప్లాన్ లో ఉంది కానీ ఇంకా అఫీషియల్ కాలేదు. ఈ గందరగోళంలో డిస్ట్రిబ్యూటర్ల తిప్పలు అన్ని ఇన్ని కావు. మొన్న తెరిచిన రెండు మూడు రోజులు సంబరం బాగానే ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ ఖాళీ సీట్లు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. సో బాక్సాఫీస్ గట్టిగా ఊపిరి పీల్చుకోవాలంటే ఇప్పుడున్న జోష్ సరిపోదు
Also Read: రమ్యకృష్ణ స్థానంలో మరో సీనియర్