iDreamPost
iDreamPost
ఒకప్పుడు అంటే పాత కాలంలో రిలీజ్ కు ముందు డిస్ట్రిబ్యూటర్లకు స్పెషల్ షోలు వేసి నిర్మాతలు రేట్లు మాట్లాడుకునేవారు. కొన్నిసార్లు వాళ్ళ డిమాండ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చేది. ఐటెం సాంగ్ లేకపోతే కొనమని భీష్మించుకు కూర్చుంటే అప్పటికప్పుడు స్పెషల్ గా షూట్ చేసిన వాళ్ళలో దాసరి లాంటి అగ్ర దర్శకులు ఉన్నారు. కానీ తర్వాత కాలక్రమంలో ఈ సంప్రదాయం వెళ్లిపోయింది. కేవలం క్రేజ్ ఆధారంగా కాంబినేషన్ మీద హైప్ ని బట్టి రేట్లు డిసైడ్ చేసి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఒకవేళ ముందు లాగా బయ్యార్లకు ఇలా చూసుకునే వెసులుబాటు ఉంటే ఎన్ని వందల కోట్ల నష్టాలు తప్పేవో. ఇప్పుడో కొత్త ట్రెండ్ వచ్చింది.
అదేంటంటే సామాన్యులకు ఫ్రీ షోలు వేయడం. ఆవును మీరు విన్నది నిజమే. దుల్కర్ సల్మాన్ సన్నీ డియోల్ కాంబోలో పా-చీనికం లాంటి విభిన్న చిత్రాలు తీసిన బాల్కి దర్శకత్వంలో రూపొందిన చుప్ ని రేపు 12 నగరాల్లో కామన్ ఆడియెన్స్ కు ఉచిత ప్రీమియర్ వేయబోతున్నారు. బుక్ మై షోలో తీసుకోవచ్చు. చార్జీలు తప్ప టికెట్ మొత్తంలో ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు. హైదరాబాద్, బెంగళూర్, చెన్నైతో పాటు మెయిన్ సిటీస్ కి ఈ ఆఫర్ ఇచ్చారు. సినిమా రివ్యూలు రాసే వాళ్ళను చంపే ఒక సైకో కిల్లర్ కథగా దీన్ని రూపొందించినట్టు ఇన్ సైడ్ టాక్. మూడు రోజుల ముందే మంగళవారం మధ్యాన్నం చుప్ ని చూసేయొచ్చన్నమాట.
ఇలాంటి ఆఫర్ ఇస్తే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. కనురెప్ప మూసి తెరిచే లోపు టికెట్లు హాట్ కేక్స్ లా వెళ్లిపోయాయి. ఇదొక్కటే కాదు 22న విడుదల కాబోతున్న పగ పగ పగ అనే మరో చిన్న బడ్జెట్ మూవీని ఆ రోజు మార్నింగ్ షోలను పబ్లిక్ కి ఫ్రీగా స్క్రీన్ చేయబోతున్నారు. నేరుగా థియేటర్ కు వెళ్తే లోపలికి పంపిస్తారు. కాకపోతే అది మిస్ చేసుకుంటే మధ్యాన్నం నుంచి కొని చూడాల్సిందే. జనాన్ని ఆకట్టుకునేందుకు ఇదొక మంచి స్ట్రాటజీ అనే చెప్పాలి. స్టార్ క్యాస్టింగ్, గ్రాండియర్లు ఉంటే తప్ప వ్యూయర్స్ అంత ఈజీగా హాళ్లకు రాని ట్రెండ్ లో ఇలా చేయడం ద్వారా కొత్త తరహా పబ్లిసిటీతో ఎక్కువ రీచ్ తెచ్చుకోవచ్చు. చూడాలి మరి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో