iDreamPost
iDreamPost
నువ్వా నేనాని బాక్సాఫీస్ వద్ద తలపడిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో చిరంజీవి ఆధిపత్యం స్పష్టంగా బయట పడింది. ఒక రోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ బాలయ్యని డామినేట్ చేస్తూ కేవలం మూడు రోజులకే 108 కోట్ల గ్రాస్ ని సాధించి వీరయ్య విజయ గర్వంతో తన రన్ ని కొనగిస్తున్నాడు. అటు ఓవర్సీస్ లోనూ 1.7 మిలియన్ డాలర్లను దాటేసి అత్యంత వేగంగా టూ మిలియన్ మార్కు వైపు పరుగులు పెడుతున్నాడు. ఇంకో రెండు మూడు రోజుల్లో అది కూడా తేలికగా చేరుకుంటాడు. ఆ తర్వాత ఎంత వస్తుందనేది డ్రాప్ శాతం మీద ఆధారపడి ఉంటుంది. చాలా చోట్ల బిసి సెంటర్లలో వాల్తేరు వీరయ్యకు థియేటర్లు షోలు సరిపోవడం లేదని ట్రేడ్ రిపోర్ట్
టాక్ మొదటిరోజు యావరేజ్ నుంచి బాగానే ఉందని అనిపించుకున్న మెగా మూవీకి వీరసింహారెడ్డికి రెండో రోజు నుంచే మొదలైన డౌన్ ఫాల్ బాగా కలిసి వచ్చింది. పైగా వారసుడులో ఉన్నది తెలుగు ప్రేక్షకులు చాలాసార్లు చూసిన రొటీన్ కంటెంట్ కావడంతో మన మాస్ అంతగా దాని మీద ఆసక్తి చూపించడం లేదు. ఇక కళ్యాణం కమనీయం పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కనీసం థియేటర్ అద్దెలు సైతం వసూలు కావడం లేదట. నిన్న హైదరాబాద్ లో పలు చోట్ల కొన్ని షోల గ్రాస్ కలెక్షన్ కనీసం అయిదు వేలు దాటలేదంటేనే అర్థం చేసుకోవచ్చు జనంలో దీని పట్ల ఉన్న అనాసక్తి గురించి. ఇవాళ నుంచి చాలా చోట్ల దీన్ని రీప్లేస్ చేయడం లాంఛనమే.
ఇక షేర్ ప్రకారం చూసుకుంటే వాల్తేరు వీరయ్య ఇప్పటిదాకా 60 కోట్లను దాటేశాడు. బ్రేక్ ఈవెన్ 90 కోట్లు కాబట్టి దాన్ని ఈజీగా అందుకోవచ్చు. పైగా ఈ శుక్రవారం పెద్దగా చెప్పుకునే రిలీజులు ఏమీ లేవు. వీరసింహారెడ్డి పికప్ కావడం అసాధ్యమనే చెప్పాలి. ఇవాళ రేపు సెలవులు పూర్తయితే అటు ఓవర్సీస్ లో ఇటు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దాటడం మీద అనుమానాలు ఉన్నాయి. సీడెడ్ లాంటి ప్రాంతాల్లో మాత్రమే బాలయ్య జోరు కనిపిస్తోంది కానీ మిగిలిన చోట్ల మాత్రం కష్టమే అనిపిస్తోంది. మొత్తానికి ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ ఆశించిన ఫలితం అందుకోలేకపోవడం లాంటి ఎదురుదెబ్బల మధ్య వాల్తేరు వీరయ్య ఫ్యాన్స్ కి ఆనందాన్ని నింపేశాడు