iDreamPost
android-app
ios-app

భోళా శంకర్‌ ఫలితం.. రెమ్యూనరేషన్‌ తిరిగిచ్చిన చిరంజీవి!

  • Published Aug 18, 2023 | 12:16 PM Updated Updated Aug 18, 2023 | 12:16 PM
  • Published Aug 18, 2023 | 12:16 PMUpdated Aug 18, 2023 | 12:16 PM
భోళా శంకర్‌ ఫలితం.. రెమ్యూనరేషన్‌ తిరిగిచ్చిన చిరంజీవి!

మెగాస్టార్‌ చిరంజీవి- మొహర్‌ రమేష్‌ కాంబోలో తెరకెక్కిన ‘భోళా శంకర్‌’ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ సినిమా ‘వేదాలం’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా సినిమా నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే భోళా శంకర్‌ ఫలితం విషయంలో మెగాస్టార్‌ చిరంజీవి.. నిర్మాత అనిల్‌ సుంకరల మధ్య మనస్పర్థలు వచ్చాయని, ఇద్దరి మధ్యా వివాదాలు కూడా జరుగుతున్నాయని ప్రచారం మొదలైంది.

ఈ ప్రచారంపై స్వయంగా అనిల్‌ సుంకర స్పందించారు. అవన్నీ ఒట్టి పుకార్లేనని.. మెగాస్టార్‌ తనకు అ‍న్ని విధాలా సహకరించే వ్యక్తని ఆయన అన్నారు. తప్పుడు ప్రచారాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్‌ చిరంజీవి మంచి మనసుకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. భోళా శంకర్‌ ఫలితం నేపథ్యంలో సినిమా కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్‌లో కొంత మొత్తాన్ని మెగాస్టార్‌ తిరిగిచ్చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఈ సినిమా కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు తీసుకున్నారట.

 నిర్మాత అనిల్‌ సుంకర సినిమా విడుదలకు ముందు ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో దాదాపు 60 కోట్ల రూపాయల్ని చిరంజీవికి ఇచ్చారట. అనిల్‌ సుంకర ఇచ్చిన చెక్కుల్లో ఒకటైన పది కోట్ల రూపాయల చెక్కును చిరంజీవి తన ఖాతాలో జమ చేయకుండా అలానే ఉంచారట. సినిమా విడుదలైన తర్వాత దాన్ని డిపాజిట్‌ చేద్దామని భావించారట. సోమవారం ఈ చెక్‌ చిరంజీవికి అకౌంట్‌లో డిపాజిట్‌ కావాల్సి ఉందట. అయితే, ఫలితాలు సరిగా లేకపోవటంతో మెగాస్టార్‌ ఆ 10 కోట్ల రూపాయల చెక్‌ను తాజాగా, అనిల్‌కు తిరిగి ఇచ్చేశారట. మరి, మెగాస్టార్‌ చిరంజీవి మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetjojobetcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet