iDreamPost
android-app
ios-app

బంగారం షాపు యజమానికి చెప్పుతో బుద్ధి చెప్పిన మహిళ!

  • Published Oct 17, 2023 | 6:53 PM Updated Updated Oct 17, 2023 | 6:53 PM
  • Published Oct 17, 2023 | 6:53 PMUpdated Oct 17, 2023 | 6:53 PM
బంగారం షాపు యజమానికి చెప్పుతో బుద్ధి చెప్పిన మహిళ!

ఆడవాళ్లపై అకృత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఆడవాళ్లతో తప్పుగా ప్రవర్తించే వారు ఎక్కువయిపోయారు. అయితే, కొంతమంది ఆడవాళ్లు తమతో తప్పుగా ప్రవర్తించే వాళ్లకు బుద్ధి చెప్పలేక తమలో తామే బాధపడితే… ఇంకా కొంతమంది మాత్రం తమతో తప్పుగా ప్రవర్తించే వారికి సరైన విధంగా బుద్ధి చెబుతున్నారు. ఇందుకు తాజా సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. తన కూతురి పట్ల తప్పుగా ప్రవర్తించిన బంగారు అంగడి యజమానికి చెప్పుతో బుద్ధి చెప్పింది ఓ మహిళ.

అందరి ముందు అతడిని చావకొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిక్కమగళూరుకు చెందిన మహ్మద్‌  అమిర్‌ ఎమ్‌జీ రోడ్డులో ఓ బంగారం షాపు నడుపుతున్నాడు. ఓ బాలిక తన తల్లితో కలిసి అతడి షాపుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అమిర్‌ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పంది. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. అమిర్‌తో గొడవపెట్టుకుంది. అంతటితో ఆగకుండా చెప్పుతో అతడిపై దాడి చేసింది. అందరూ చూస్తుండగా.. చెప్పుతో పలుసార్లు కొట్టింది.

అక్కడివాళ్లు కూడా ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. అతడ్ని అడ్డుకుని ఎక్కడికీ పోకుండా చూసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఇలాంటి వాళ్లను ఊరికే వదిలేయకూడదు. పోలీసులకు పట్టించాలి’’..‘‘చిన్న పిల్లలతో తప్పుగా ప్రవర్తించే వారిని ఉరి తీయాలి’’..‘‘ రోజుకు రోజుకు ఆడవాళ్లపై ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి’’ అంటూ మండిపడుతున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom