Idream media
Idream media
ప్రజాసేవలో తనకు తానే సాటి అని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరూపిస్తున్నారు. కరోనా ఆపత్కాలంలో తన నియోజకవర్గ ప్రజలకు, ప్రభుత్వ సిబ్బందికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. కరోనా నుంచి రక్షణ ఇచ్చే మాస్కులు, శానిటైజర్లు, ఇతర సామాగ్రిని పంపిణీ చేయడంతో పాటు నిత్యావసర వస్తువులను భారీ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సిబ్బందికి అందించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కరోనా ఆపత్కాలంలో చేవిరెడ్డి తన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ స్ఫూర్తితో ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ నియోజకవర్గ ప్రజలకు వీలైనంత మేరకు సహాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
చెవిరెడ్డి దాతృత్వానికి సాటేది లేదన్నట్లుగా తాజాగా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం చంద్రగిరి నుంచి కరోనా అనుమానిత లక్షణాలతో క్వారంటైన్ కి వెళ్లినవారికి, కరోనా సోకి తిరిగి కోరుకున్న వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు ముందుకు వచ్చారు. క్వారంటైన్ కి వెళ్లి తిరిగి వచ్చిన వారికి మూడు వేల రూపాయలు, కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న బాధితులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇందుకోసం 25 లక్షల రూపాయలను కేటాయించారు.
కాగా, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 80 మందికి కరోనా సోకింది. ఇందులో ఒక్క శ్రీకాళహస్తిలోనే 49 మందికి ఈ వైరస్ వచ్చింది. ఇప్పటివరకు వైరస్ నుంచి 24 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు.