iDreamPost
android-app
ios-app

ఛార్జీషీట్‌.. 32 వేల పేజీలు..!!

ఛార్జీషీట్‌.. 32 వేల పేజీలు..!!

ముప్పై కాదు, మూడు వందలు కాదు, మూడు వేలు కాదు… ఏకంగా 32 వేల పేజీలు. పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో ఆపరేటివ్‌ (పీఎంసీ) బ్యాంకు కుంభ కోణంపై పోలీసులు 32 వేల పేజీలతో ఛార్జీషీటు దాఖలు చేశారు. పీఎంసీ బ్యాంకు పాలక వర్గం పెద్ద మొత్తంలో ఆర్థిక నేరానికి పాల్పడిన విషయం తెలిసిందే.

బ్యాంకులోని ఖాతాదారుల సొమ్ము 4,355 వేల కోట్ల రూపాయలు పాలక వర్గం పక్కదారి పట్టించింది. పీఎంసీ మాజీ ఎండీ జాయ్‌ థామస్, మాజీ చైర్మన్‌ వర్యమ్‌ సింగ్, మాజీ డైరెక్టర్‌ సుర్జిత్‌ సింగ్లు ఈ స్కామ్‌కు పాల్పడ్డారు. ఖాతాదారుల సొమ్మును మళ్లించి సొంత ఆస్తులు సమకూర్చుకున్నారు. ఈ కుంభకోణంలో హౌసింగ్‌ డెవెలెప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్ట్రాస్టక్ఛర్‌ లిమిటెడ్‌(హెచ్‌డీఐఎల్‌) ప్రమోటర్లు రాకేశ్‌ వర్థమాన్, సారంగ్‌ వర్థమాన్‌లు కూడా నిందితులుగా ఉన్నారు.

ఈ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం స్కాం వివరాలు, సాక్షుల వాగ్మూలం తదితర వివరాలతో 32 వేల పేజీల చార్జిషీటును సిద్ధం చేసింది. దాన్ని ముంబై మెట్రోపాలిటిన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టుకు సమర్పించింది.