iDreamPost
android-app
ios-app

గ్యాంగ్ లీడర్ లేడీబాస్ కాంబో కుదిరేనా ?

  • Published Jan 06, 2020 | 7:48 AM Updated Updated Jan 06, 2020 | 7:48 AM
  • Published Jan 06, 2020 | 7:48 AMUpdated Jan 06, 2020 | 7:48 AM
గ్యాంగ్ లీడర్ లేడీబాస్ కాంబో కుదిరేనా ?

నిన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో పెర్ఫార్మెన్సులు, స్పీచులు ఒక ఎత్తు, ఆఖర్లో చిరంజీవి-విజయశాంతిల మధ్య జరిగిన సంభాషణ ఒక ఎత్తు అనేలా సాగింది. తమదైన మార్కు టైమింగ్ తో చిరు ఒకవైపు విజయశాంతితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే రాజకీయాల్లో ఉన్నప్పుడు తన మీద లేడీ అమితాబ్ చేసిన కామెంట్స్ గురించి నేరుగానే చురకలు వేశారు. దీనికి ధీటుగా బదులిచ్చిన రాములమ్మ మరి మీరు వెనుక నా గురించి ఏమి అనుకోలేదా అంటూ నేరుగానే అడిగేసింది.

ఇది సరదాగానే సాగి ఆఖరికి ఇద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో అభిమానులకు కొత్త కిక్ వచ్చింది. దీనికి తోడు ఈ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో నిన్న రాత్రి నుంచే ఒకటే రచ్చ, విపరీతమైన మేమ్స్ ముంచెత్తాయి. వీళ్లిద్దరి గెట్ టుగెదర్ కి మహేష్ బాబు అతిథిగా వచ్చినట్టుందని ఓ రేంజ్ లో ఛలోక్తులు వచ్చి పడ్డాయి. అయితే స్టేజి మీద మాటల్లో భాగంగా విజయశాంతి మళ్ళీ ఇద్దరం కలిసి నటిద్దామా అని చిరుని నేరుగా అడిగేయడం, ఆయన వెంటనే వై నాట్ అంటూ ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి.

అక్కడ అనుకోవడం వరకు బాగానే ఉంది కానీ నిజంగా చిరంజీవి సినిమాలో విజయశాంతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే 63 ఏళ్ళ వయసులోనూ చిరు ఇంకా హీరోనే. న్యూ ఏజ్ హీరోయిన్స్ కాజల్, నయనతార, తమన్నా లాంటివాళ్లతో జట్టు కడుతున్నాడు. కానీ విజయశాంతి ఇప్పటికే 13 ఏళ్ళ గ్యాప్ తీసుకుని సరిలేరు నీకెవ్వరులో కీలక పాత్రతో కం బ్యాక్ ఇస్తోంది.

మరి ఏ దర్శకుడైనా ఈ కాంబినేషన్ ని ట్రై చేసినా వర్క్ అవుట్ అయ్యేదాకా నమ్మలేం. గతంలో ఖైదీ హీరోయిన్ మాధవి చిరు బిగ్ బాస్ లో సపోర్టింగ్ రోల్ లో నటించింది. తర్వాత రాధ, భానుప్రియ, శ్రీదేవి, రోజా, మీనా లాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా చిరంజీవి సినిమాల్లో మాత్రం సపోర్టింగ్ రోల్స్ చేసే సాహసం చేయలేదు. మరి వీళ్లందరి కంటే పవర్ ఫుల్ బ్రాండ్ ఉన్న విజయశాంతి చిరు సినిమాలో నటిస్తుందా అంటే అనుమానమే. దీనికి సమాధానం ఇప్పట్లో దొరకడం కష్టం.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom