iDreamPost
android-app
ios-app

చంద్రయాన్-3లో పూర్తైన మరో ఘట్టం.. విజయవంతగా జాబిల్లిలోకి ఎంట్రీ!

చంద్రయాన్-3లో పూర్తైన మరో ఘట్టం.. విజయవంతగా జాబిల్లిలోకి ఎంట్రీ!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ‘ఇస్రో’.. అత్యంత ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్ 3 మిషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. జులై 14న  ఎల్ వీఎం-3 ఎం-4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3ని ప్రయోగించారు. ఈ రాకెట్ ను విజయవంతంగా భూకక్ష్యలోకి  ప్రవేశపెట్టారు. ఇక ఈ చంద్రయాన్ కు సంబంధించిన ప్రతి ఘట్టం గురించి తెలుసుకునేందుకు యావత్తు భారత దేశం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంది. అలానే ఇప్పటి వరకు భూకక్ష్యను చంద్రయాన్-3 పూర్తి చేసుకుని.. జాబిల్లి కక్ష్యలోకి సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చింది. దీంతో  చంద్రయాన్-3 మిషన్ లో భాగంగా మరో కీలక ఘట్టం పూర్తైంది.

భూమి చుట్టూ పలుమార్లు తిరిగి ప్రస్తుతం ట్రాన్స్‌లూనార్ మార్గంలో పయనిస్తున్న చంద్రయాన్-3.. నేడు చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రయాన్ ఇప్పటి వరకు భూమి  కక్ష్యలను పూర్తి చేసుకుని, ట్రాన్స్ లూనార్ కక్ష్య లోకి వెళ్లి జాబిల్లివైపు రాకెట్ దూసుకెళింది. ఇక నుంచి చంద్రుడి చుట్టూ భ్రమించనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3ని ప్రవేశపెట్టే ప్రక్రియను ఇస్రో విజయవంతగా పూర్తి చేసింది. జూలై 14న ప్రయోగించిన చంద్రయాన్-3.. 18 రోజుల వ్యవధిలో దశలవారీగా  అయిదు సార్లు  కక్ష్యలను పెంచుతారు.

తొలిసారిగా.. చంద్రయాన్-3 ప్రయోగించిన మరుసటి రోజే.. దీని కక్ష్యను పెంచారు.  ఇలా అయిదో కక్ష్య పూర్తైన అనంతరం.. ఈ వ్యోమనౌక జాబిల్లి వైపుగా ఆగష్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్య లోకి ప్రవేశించింది.  ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో చంద్రుడి కక్ష్యలోకి  ఈ రాకెట్ ను ప్రవేశపెట్టారు. ఇక ఈ  చంద్రయాన్-3..తన ప్రయాణంలో మూడింట రెండొంతులు ఇప్పటికే పూర్తి చేసింది. ఇక అంతా సజావుగా సాగితే ఆగష్టు 23న చంద్రుడిపై  ల్యాండర్  దిగనుంది.

చంద్రయాన్‌-3 చంద్రుడికి అత్యంత దగ్గరగా చేరినప్పుడు లూనార్ కక్ష్యలోకి పంపించే పక్రియను ఇస్రో చేపటింది. ప్రస్తుతం దీని పనితీరు బాగానే ఉందని, చంద్రుని కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల 23న దీన్ని చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. మరి.. చంద్రయాన్-3లో భాగంగా మరో కీలక ఘట్టం పూర్తి చేసుకున్న ఇస్రోకు మీ అభినందనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.