Idream media
Idream media
టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబుకు రైట్ హ్యాండ్, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. ఆధారాలు ఉన్నాయని, అందుకే అరెస్ట్ చేశామని స్వయానా అధికారులే చెప్పారు. చంద్రబాబు అండ్ కో.. దీన్ని పెద్ద రాజకీయం చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు బీసీ కార్డును వాడుకునే ప్రయత్నం చేస్తోంది. బీసీ గొంతుక గా ఉన్నందుకే అచ్చెన్నాయుడు ను అరెస్ట్ చేశారని విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. బీసీ ల పై అంత ప్రేమున్న వారు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు బీసీలను ఎలా మోసం చేశారో.. మరిచి పోయారా అంటూ…. సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ చేస్తున్నారు. వీటికి ఏం సమాధానం చెబుతారు అంటూ పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు.
2014 ఎన్నికల సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో బి.సి ల ఓట్లు దండుకునే ఉద్దేశ్యంతో బీసీ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ సీఎంను చేస్తానని రెండు రాష్ట్రాల్లో బీసీల ఓట్లు బాబు దండుకున్నారు. తీరా ఎన్నికలయ్యాక తెలంగాణలో ఆర్ కృష్ణయ్యకు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ పదవిగానీ, పార్టీ అద్యక్ష పదవిని కూడా ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు.
ఒక BC మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని తన పెయిడ్ ఆర్టిస్టు సోమశేఖర్ చౌదరికి రైతు వేషం వేయించి “గొర్రెలు కాచుకునే ఒక గొల్లవాడు మంత్రి ఐతే పాలన ఇలాగే ఏడుస్తుంది” అంటూ తీవ్రంగా బాబు దూషించాడు. బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తనవద్దకు వచ్చిన నాయీ బ్రాహ్మణులను పరుష పదజాలంతో దూషించారు.
దేశంలో SC,ST లకు మాదిరిగా మొట్టమొదటిసారిగా BCలకు చట్ట సభల్లో (MLA,MP లకు) రిజర్వేషన్ ఇవ్వాలని YCP తరపున రాజ్యసభలో ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టారు. (14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు ఈ విధంగా బీసీల కోసం బిల్లు ఎందుకు పెట్టలేకపోయాడు ?). స్దానిక సంస్దల ఎన్నికల్లో జగన్ 59.65 శాతం రిజర్వేషన్లను కల్పించాలని భావిస్తే, టీడీపీ కి చెందిన బిర్రు ప్రతాపరెడ్డి చేత స్దానిక ఎన్నికల్లో 59.65 శాతం ఇవ్వరాదంటూ కోర్టులో కేసు వేయించి బీసీలకు అన్యాయం చేసింది చంద్రబాబే.
Also Read: ఉత్తరాంధ్ర అంటే అచ్చెన్నాయుడు ఒక్కడేనా…ఆయనెప్పుడు బిసి నాయకుడయ్యాడు?
బాబు అధికారంలో ఉండగా బి.సి కులాలైన రజకులకు ఇస్త్రీ పెట్టెలు,గీత కార్మికులకు కొన్ని పనిముట్లు,నాయీ బ్రాహ్మణులకు కత్తెరలు మాత్రమే ఇచ్చి పండగ చేసుకోండంటూ చేతులు దులుపుకుంటే, ఇప్పుడు జగన్ ఆయా వర్గాలవారికి అనేక పధకాల్లో అధిక ప్రా ధాన్యతనిచ్చి శాశ్వత లబ్దిని చేకూరుస్తూ పరిపాలిస్తున్నాడు.
పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించిన మొదటి వ్యక్తి జగన్…అలాగే వారికి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టిన పార్టీ వైసీపీ మాత్రమే. 103 మున్సిపల్/నగరపంచాయతీ చైర్మన్ల రిజర్వేషన్లలో BCలకు 34 సీట్లు కేటాయించారు. మహిళలకు 51 చైర్ పర్సన్ పదవులు కేటాయించారు.
ఇప్పటి ఏడాది కాలంగా జగన్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పధకాలద్వారా లబ్ధిదారులు 3.58 కోట్ల మంది ఉండగా…. వారి ఖాతాల్లో రూ.40,627 కోట్లు జమ చేశారు. వీరిలో 1,78,42,048 కోట్ల మంది బీసీలకు రూ.19,309 కోట్లు లబ్ది చేకూరింది.
అలాగే ప్రస్తుత జగన్ మంత్రివర్గంలో 60 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఈ వర్గాలకే ఇచ్చారు. సచివాలయ ఉద్యోగాలలో 82.5 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించారు. దుర్గ గుడి పాలక మండలిలో తొలిసారిగా బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించారు. కృష్ణా ఏఎంసీలో కూడా వారికే స్థానం దక్కేలా చేశారు. ఎస్సీలకు మూడు వేర్వేరు కమిషన్లతోపాటు శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు.
Also Read: అచ్చెం నాయుడు అరెస్ట్ – ముందస్తు నోటీస్ మీద ఎందుకు ఈ గోల?
నిజంగా చంద్రబాబుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై ప్రేమ, గౌరవం ఉంటే రాజధానిలో 1,251 ఎకరాల్లో నిరుపేదలకు 54 వేల ఇళ్ళ స్ధలాలను ఇప్పటి జగన్ ప్రభుత్వం ఇవ్వబోతుంటే ఎందుకు అడ్డు పడుతున్నారో సమాధానం చెప్పాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వర్గాల్లో ఉన్న పేదలకు ప్రభుత్వం మొత్తంగా 29 లక్షలమందికి ఇళ్ళ స్ధలాలు ఇవ్వాలని సిద్ధపడితే, బాబు తనవారి ద్వారా కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తూ, తన కుల మీడియాలో మడ అడవుల ధ్వంసమంటూ తప్పుడు ప్రచారాలకు తెర లేపుతూ ఎందుకు అడ్డుపడుతున్నాడో సమాధానం చెప్పాలి.
రాజధాని భూమిలో అణగారిన వర్గాల వారికి ఇంటి స్థలాలను కేటాయిస్తూ జారీ చేసిన జీఓ 107ని రద్దు చేయాలని చంద్రబాబు తన అనుచరులతో హైకోర్టులో పిటిషిన్ వేయించిన విషయం వాస్తవం కాదా? చంద్రబాబుకు నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలపై గౌరవం ఉంటే, 107 జీవోకు వ్యతిరేకంగా కోర్టులో వేయించిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలి కదా ?… అంటూ బాబు అండ్ కో కు ప్రశ్నలు సందిస్తూనే.. జగన్ బీసీ లకు చేసిన మేలు గుర్తు చేస్తున్నారు. ఓ అవినీతి కేసులో అరెస్ట్ అయిన వారికి వంత పాడడమే కాకుండా…. దానికి బీ సీ కార్డు వాడొద్దని హెచ్చరిస్తున్నారు.