iDreamPost
android-app
ios-app

కొన్ని విషయాలు మాట్లాడకపోవడమే మంచిది

  • Published Sep 04, 2020 | 2:15 PM Updated Updated Sep 04, 2020 | 2:15 PM
కొన్ని విషయాలు మాట్లాడకపోవడమే మంచిది

ఎంత గొప్పోడైనా జీవిత కాలంలో ఏదో ఒక మైనస్‌లు ఉంటూ ఉంటాయి. అయితే చంద్రబాబులాంటి వ్యక్తుల విషయంలో ప్రత్యర్ధులకు ఇటువంటివి అనేకం కన్పిస్తున్నాయి. వీటికి తోడు ఆయన చేసే పనుల్లో కూడా మరింకొన్ని వారికి దొరికేస్తున్నాయి. కొన్ని విషయాలను గురించి కొందరు వ్యక్తులు మాట్లాడుతుంటే వినడానికి జనానికి కాస్తంత ఇబ్బందిlగానే ఉంటుంది. అందులోనూ వ్యవసాయం గురించి, ఉచిత విద్యుత్‌ గురించి చంద్రబాబునాయుడు మాట్లాడుతుంటే ఆ ఇబ్బంది మరింత ఎక్కువ అవుతుంది. ఆయన ప్రత్యర్ధులకు ఇంకాస్త ఎక్కువగా అవుతుంటుంది.

వ్యవసాయం దండగ అని చెప్పడం గానీ, ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదు అనడం గానీ, కరెంటు కోసం పోరాడుతున్న రైతులపై కాల్పులు జరిపించడం, గుర్రాలతో తొక్కించడం గానీ, మొన్నటికి మొన్న రైతుల బంగారం బ్యాంకుల్లోనుంచి రాకుండా చేయడం (రుణాల రద్దు హామీతో) చేయడం గానీ చేసి ఉండకపోతే ఆయన మాట్లాడినా జనం కొంచెం దృష్టి పెట్టి వినుండేవాళ్ళు. అయితే ఇవన్నీ వాళ్ళ మనస్సుల్లోనుంచే ఇంకా చెప్పాలంటే కళ్ళముందునుంచే ఇంకా చెరిగిపోలేదాయె.

దీంతో చంద్రబాబు ఎప్పుడు రైతుల గురించి మాట్లాడినా జనం నోరెళ్ళబెట్టి వింటుంటారంటే అతిశయోక్తి కాదు. వాళ్ళ తరపున మైకందుకున్న రాజకీయ ప్రత్యర్ధులు పరిమితికి మించి విరుచుకుపడడం కూడా సహజంగానే జరిగిపోతుంటుంది. ఉచిత విద్యుత్‌ను అందించిన ఘనత దివంగత నాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుంది.

ఆయన అడుగు జాడల్లో ప్రభుత్వాన్ని సంక్షేమ పథంలో నడుపుతున్న వైఎస్‌ జగన్‌ ఉచిత విద్యుత్‌ను ఎందుకు తీసేస్తారు? కనీసం ఈ లాజిక్‌ కూడా లేకుండా ఉచిత విద్యుత్‌ గురించి మైకు ముందుఉంది కదా? అని చంద్రబాబు ఏదో ఒకటి అనేసారు పాపం. దీంతో మంత్రి కొడాలి నాని తగులు కున్నారు. ముఖం మీద కొట్టినట్టు మాట్లాడే ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇప్పుడు చంద్రబాబు అండ్‌ బృందం తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం ద్వారా ఏం నష్టం జరుగుతుందో? చంద్రబాబు సూటిగా చెప్పగలరా? అంటూ ప్రశ్నను మంత్రి నాని లేవనెత్తారు. దీంతో పాటే చంద్రబాబు గురించి ఆయన చేసే రాజకీయాలను గురించి కాస్తంగా ఘాటుగానే విమర్శలు చేసారు.

హామీ ఇచ్చిందీ, ఇవ్వందీ కూడా అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌ తన మానిఫెస్టోలో అత్యంత కీలకమైన రైతుల సంక్షేమం విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తారు? అన్న ఆలోచన కూడా లేకుండా ఏదో ఒక ఆరోపణ చేయాలి అన్న లక్ష్యంతోనే చంద్రబాబు ఆయన బృందం చేసిన ‘ఉచిత విద్యుత్‌’ విమర్శ కూడా తేలిపోయిందనే చెబుతున్నారు. రాజకీయ విశ్లేషకులు. ఏదో ఒకటి చేయాలిగనుక చేస్తున్నాం.. అన్న రీతిలో చేసే ఈ విమర్శల వల్ల టీడీపీకి వచ్చే మేలుకంటే కీడే ఎక్కువన్నది రాజకీయవర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. ఇటువంటి పసలేని కార్యక్రమాల కంటే మూతేసుక్కూర్చుంటేనే మేలన్న సలహాలు కూడా రాజకీయ ప్రత్యర్ధుల నుంచి విన్పిస్తున్నాయి.