iDreamPost
android-app
ios-app

పోలీసులకే ఝలక్‌ ఇచ్చిన చిత్ర.. అసలు విషయం తెలిసి షాక్‌!

పోలీసులకే ఝలక్‌ ఇచ్చిన చిత్ర.. అసలు విషయం తెలిసి షాక్‌!

7 కోట్ల రూపాయల చీటింగ్‌ కేసులో కర్ణాటకకు చెందిన ప్రముఖ హిందుత్వ వాది చిత్రా కుందాపుర అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. గోవింద బాబు అనే ప్రముఖ వ్యాపార వేత్తకు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని చెప్పి.. చిత్ర గ్రూపు ఆయన దగ్గరినుంచి 7 కోట్ల రూపాయలు దోచుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు చెప్పి.. బీజేపీ టికెట్‌ ఇప్పిస్తామని నమ్మబలికింది ఈ గ్రూపు. డబ్బు తీసుకున్న తర్వాత చేతులు ఎత్తేసింది. తాను మోస పోయానని గ్రహించిన గోవింద బాబు పోలసులను ఆశ్రయించాడు. రెండు రోజుల క్రితం సీసీబీ పోలీసులు చిత్రతో  పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణ సందర్భంగా హైడ్రామా చోటుచేసుకుంది. చిత్రకు ఫిట్స్‌ రావటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమెకు ఫిట్స్‌ రాలేదని వైద్యులు తేల్చారు. ఆమె సబ్బు నురగ నోటికి పూసుకుని డ్రామా ఆడిందని పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులకు చిత్రపై అనుమానం వచ్చింది. జైలులో ఆమె ఉన్న గదిని పరిశీలించారు. ఫిట్స్‌కు సంబంధించి గానీ, ఇతర అనారోగ్య సమస్యలకు సంబంధించి గానీ ఎలాంటి మందులు లభించలేదు.

ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించారు. ఆమెకు ఎలాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేవని తేలింది. ఆస్పత్రికి వచ్చిన తర్వాత ఆమె నోరు తెరవలేదని వైద్యులు తెలిపారు. వారు ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేయగా.. మాట్లాడ్డం తన వల్ల కావటం లేదని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. ఆమె డ్రామా ఆడుతోందని పోలీసులు గుర్తించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet giriştürk pornoMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişJojobetjojobetgrandpashabetcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabet