iDreamPost
android-app
ios-app

అఖిల్ కి కలిసొచ్చే చైతు డీల్

  • Published Feb 19, 2020 | 6:49 AM Updated Updated Feb 19, 2020 | 6:49 AM
అఖిల్ కి కలిసొచ్చే చైతు డీల్

అక్కినేని అన్నాతమ్ముళ్ళు నాగ చైతన్య. అఖిల్ లు తమ కొత్త సినిమాల ఫినిషింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. అయితే విడుదల తేది విషయంలో రెండు యూనిట్లు ఇంకా ఏ విషయమూ చెప్పలేదు. అఫీషియల్ అనౌన్స్ మెంట్ కన్నా ముందు సాధ్యమైనంత మేరకు క్లాష్ లేకుండా ప్లాన్ చేసుకుంటున్నారని గతంలోనే టాక్ వచ్చింది. తాజా అప్ డేట్ ప్రకారం లవ్ స్టొరీకి ముందు అనుకున్న ఏప్రిల్ 16కి దాని స్థానంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వచ్చే అవకాశం ఉందట.

శేఖర్ కమ్ముల సినిమాను ఇంకా పూర్తి చేయలేదని ఫైనల్ రషెస్ ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని అవసరమైతే రీ షూట్స్ ని ప్లాన్ చేసుకుని పక్కాగా కాపీని రెడీ చేస్తారట. అంతేతప్ప విడుదల కోసం ఓ డేట్ అనేసుకుని దాని కోసం కిందామీదా పడుతూ హడావిడి చేసి క్వాలిటీ పోగొట్టుకోవడం కంటే నెమ్మదిగా అయినా మంచి సినిమాతో రావడమే శేఖర్ కమ్ముల ఉద్దేశమట. ఈ లెక్కన లవ్ స్టొరీ రావడం కొంత లేట్ అవ్వొచ్చు. ఇటీవలే రిలీజ్ చేసిన వీడియో గ్లిమ్ప్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బజ్ ని ఇంకా పెంచే ప్లాన్ లో ఉంది టీం.

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫైనల్ స్టేజి ప్రొడక్షన్ లో ఉంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు జస్ట్ పర్వాలేదు అనే టాక్ వచ్చిన నేపధ్యంలో మంచి టీజర్ ని రెడీ చేసే పనిలో ఉంది భాస్కర్ టీం. అఖిల్ కి ఇది కచ్చితంగా హిట్ కావలసిన తరుణంలో ఏ చిన్న అవకాశాన్ని గీతా ఆర్ట్స్ వదలడం లేదు. చైతు సినిమా వాయిదా పడితే వాళ్ళు వదిలేసిన ఏప్రిల్ 16ని బ్యాచిలర్ ని లాక్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇదంతా ఖరారు కావడానికి ఇంకొద్ది రోజులు పట్టొచ్చు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు పూజా హెగ్డే గ్లామర్, గోపి సుందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి అక్కినేని బ్రదర్స్ లో ఎవరు ముందు వస్తారో తేలాలంటే కొంచెం వెయిట్ చేయక తప్పదు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet