సాధారణంగా మనం ప్రజల నుంచి తరచుగా వినే మాట.. కరెంట్ బిల్లులు పెరిగిపోతున్నాయి, వినియోగం తక్కువ ఉన్నప్పటికీ బిల్లు ఎక్కువగా వచ్చిందని కంప్లైంట్స్ వస్తుంటాయి. ఇక ఇలాంటి సమస్యల నుంచి సాధారణ, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలగనుంది. మీ విద్యుత్ బిల్లులు తగ్గే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సాధారణ, మధ్య తరగతి విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రీసిటీ రూల్స్ 2020 చట్టంలో సవరణలు చేసింది. ఇక ఈ చట్టంలో సవరణలు చేయడం ద్వారా వినియోగదారులు తమ కరెంట్ బిల్లులు తగ్గించుకోవడానికి వీలు కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. టైమ్ ఆఫ్ డే (ToD) టారిఫ్ సిస్టమ్ ద్వారా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎలక్ట్రిసిటీ టారిఫ్ సిస్టమ్ లోని మార్పులు అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్ర తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా కరెంటు బిల్లుల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
టైమ్ ఆఫ్ డే టారిఫ్ సిస్టమ్ అనేది గరిష్ట విద్యుత్తు డిమాండ్. 10 కిలోవాట్లు అంతకన్నా ఎక్కువగా ఉండే కమర్షియల్, ఇండస్ట్రీయల్ వినియోగదార్లకు ఏప్రిల్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. వీరితో పాటుగా వ్యవసాయ వినియోగదార్లకు మినహా మిగతా వినియోగదార్ల ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ అంశంపై తాజాగా సెట్రల్ గవర్నమెంట్ ఓ ప్రకటనను జారీ చేసింది. ఈ టారిఫ్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే వారికి సోలార్ హవర్స్ లో 20 శాతం తక్కువగా ఉంటుంది. అలాగే కరెంట్ డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయాల్లో పది నుంచి ఇరవై శాతం ఎక్కువగా ఉంటుంది. ఇక ToD నియమాలను కచ్చితంగా పాటించేవారికి బెనిఫిట్స్ ఉంటాయని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇక మీటరింగ్ నియమాల్లో చేసిన సవరణల ప్రకారం.. స్మార్ట్ మీటర్ ఇన్ స్టాల్ చేసిన తర్వాత కన్జ్యూమర్స్ పై ఎలాంటి పెనాల్టీ ఛార్జీలు పడవు. ఇక ఈ మీటర్లు పెట్టక ముందు గరిష్ఠ డిమాండ్ ను రికార్డు చేస్తారు కాబట్టి పెనాల్టీ పడేందుకు ఆస్కారం ఉండదు. ఇక ఎలక్ట్రిసిటీ రూల్స్ సవరణలు వినియోగదారులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చేందుకే అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.