iDreamPost
android-app
ios-app

రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్రం శుభవార్త! వారికి మరో అవకాశం..

  • Author Soma Sekhar Published - 11:13 AM, Wed - 21 June 23
  • Author Soma Sekhar Published - 11:13 AM, Wed - 21 June 23
రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్రం శుభవార్త! వారికి మరో అవకాశం..

నేటి ఆధునిక సమాజంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి తగ్గట్టుగానే సైబర్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ మోసాలను దృష్టిలో ఉంచుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మరి కేంద్ర ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పేద ప్రజలకు ఉచితంగా, చవక రేటుకే నిత్యావసరాలను రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వాలు ప్రజలకు అందిస్తున్నాయి. అయితే రేషన్ కార్డుల్లో జరుగుతున్న అవకతవకలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది. తాజాగా మరోసారి నకిలీ రేషన్ కార్డులను, ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డుదారులను అరికట్టడానికి పూనుకుంది. అందుకే రేషన్ కార్డులకు ఆధార్ లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి జూన్ 30 చివరి తేదీగా ప్రకటించింది. తాజాగా ఈ డేట్ న్ పొడిగించింది. రేషన్ కార్డును ఆధార్ తో లింక్ చేయని వారికి మరోసారి అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 30 వరకు రేషన్ కార్డు తో ఆధార్ లింక్ చేయాలని ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రేషన్ కార్డు లబ్దిదారులకు సూచించింది.