iDreamPost
android-app
ios-app

TDP, Kesineni Nani, Budda Venkanna – నాని విష‌యాన్ని త్వ‌ర‌గానే తేల్చేసిన బాబు

TDP, Kesineni Nani, Budda Venkanna – నాని విష‌యాన్ని త్వ‌ర‌గానే తేల్చేసిన బాబు

లాభం క‌లిగించేదైనా, న‌ష్టం చేసేదైనా, ఇష్యూ ఏదైనా.. సుదీర్ఘ‌కాలం సాగ‌దీస్తార‌న్న పేరు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడుకైతే ఉంది. ఇటీవ‌లి కాలంలో చాలా అంశాల‌పై ఆయ‌న మ‌రింత సాగ‌దీత ధోర‌ణిలో అవ‌లంబిస్తున్నారు. పొర‌పాటున ఎవ‌రికైనా అది నచ్చ‌క‌పోతే పార్టీకి అసంతృప్తుల దెబ్బ మ‌రింత‌గా ఉంటాదోన‌న్న అనుమానాలు ఆయ‌న‌ను వెంటాడుతున్నాయి. కానీ.. కేశినేని నాని విష‌యంలో మాత్రం బాబు వీలైనంత త్వ‌ర‌గానే తేల్చేశారు. దీనివ‌ల్ల విజ‌య‌వాడ పార్టీలో చెల‌రేగుతున్న అసంతృప్తులు ఎలాగున్నా.. విష‌యం కొలిక్కిరావ‌డంపై త‌మ్ముళ్లు ఒకింత నిబ్బ‌రంగా ఉన్నారు.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే..

న‌ల‌భై ఏళ్ల అనుభ‌వ‌శాలిన‌ని చెప్పుకునే బాబు.. ఇంత వయసు.. అనుభవం వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే తెగ ఆలోచిస్తారు. ఎంతకూ ఒక నిర్ణయానికి రారు. అదే పనిగా నానపెట్టి ఉంచుతారే కానీ తేల్చేయరు. అధికారంలో ఉండగా పార్టీని పట్టించుకోవటానికి టైం దొరకని బాబు.. విపక్షంలో ఉన్నప్పుడు పార్టీని పట్టించుకున్నా.. తెగింపు నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఆయనలో కనిపించదు. దీంతో.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటుంది తప్పించి మార్పు రాదు. తెలుగు రాష్ట్రాల్లో మరే పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ బలాన్ని తగిన రీతిలో ఉపయోగించుకోవటంలో చంద్రబాబు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఎన్ని అనుభవాలు ఎదురైనా.. మరెన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. పార్టీలో జెండా మోసినోడికి న్యాయం జరుగుతుందన్న విషయంలో మాత్రం బాబు భరోసా ఇవ్వలేకపోతారు. ఎవరిని నొప్పించకూడదన్న భావంతో.. చివ‌ర‌కూ అంద‌రూ నొచ్చుకునే వ‌ర‌కూ కాలం వెళ్ల‌దీస్తూనే ఉంటారు.

అలాంటి ఆయన ఎట్టకేలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ చార్జి పదవి విషయంలో స్పష్టత ఇచ్చారు. గడిచిన కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఇష్యూను.. ఎట్టకేలకు క్లియర్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. ఈ పదవి కోసం కేశినేనితో పాటు పోటీ పడ్డ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న.. నాగుల్ మీరాకు నిరాశ తప్పలేదు. కాకుంటే.. ఇన్నాళ్లు నాన్చి.. నాన్చి నేతలకుచిరాకు తెప్పిస్తున్న చంద్రబాబు.. ఎట్టకేలకు ఎవరో ఒకరికి ఇన్ చార్జి బాధ్యతల్ని అప్పగించిన వైనం పై మాత్రం కిందిస్థాయి కార్యకర్తలు హ‌మ్మ‌య్య ఏదోఒక‌టి తేలిపోయింద‌నే భావ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కేశినేనికి కొత్త బాధ్యతలపై చంద్రబాబు.. ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయాన్ని తీసుకున్నార‌నేది మాత్రం ప్ర‌శ్నార్థ‌కం.

Also Read :  ఎంపీకి పోటీపై త‌మ్ముళ్ల టెన్ష‌న్?