చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రనా? ప్రకాశం ఆత్మగౌరవం గుండ్లకమ్మ చూసి దణ్ణం పెట్టుకొని పో బాబు..

  • Published - 07:55 AM, Tue - 18 February 20
చంద్రబాబు ఆత్మగౌరవ యాత్రనా? ప్రకాశం ఆత్మగౌరవం గుండ్లకమ్మ చూసి దణ్ణం పెట్టుకొని పో బాబు..

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడి కనీసం ఎనిమిది నెలలు కూడా కాలేదు. అంతలోనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజకీయ యాత్రలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు అమరావతి, ఇసుక వంటి అంశాలమీదనే పోరాడిన తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మొదటిసారి ప్రజా చైతన్య యాత్ర పేరుతొ బస్సు యాత్రలు మొదలుబెట్టబోతున్నారు.

రేపటి నుండి ఈ బస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ పరంగా గత ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని, కొంత మెరుగైన ఫలితాలు సాధించిన ప్రకాశం జిల్లా నుండే ఈ యాత్రను ప్రారంభించనున్నారు. ఇప్పటికే స్థానిక పార్టీ నాయకత్వం కూడా దానికి తగ్గ ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదట పర్చూరు నియోజకవర్గం పరిధిలో ప్రారంభం కానున్న చంద్రబాబు బస్సు యాత్ర అద్దంకి నియోజకవర్గం మీదుగా ఒంగోలు వరకు జరగనుంది. తమ పార్టీకి చెందిన వారిపై ఐటీ దాడులు జరగటం, రూ.రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెల్లడికావడంతో ఆందోళనలో ఉన్న టీడీపీ నేతలు యాత్ర నిర్వహించాలా వద్దా అనే దానిపై పూర్తిగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్లు తెలిసింది. ఒకవేళ యాత్ర చేసినా తూతూమంత్రంగా ఏర్పాట్లు చేయాలని స్థానిక పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.

చంద్రబాబు పర్యటన, మిగతా రాజకీయ అంశాలు పక్కన పెడితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం 2014 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక, అభివృద్ధి పరంగా ఆత్యంత నిరాధరణకు గురైనా జిల్లా రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ప్రకాశం జిల్లానే అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు హాయంలో నిర్దిష్టంగా ప్రకాశం జిల్లాకు జరిగిన ప్రయోజనం శున్యమనే చెప్పాలి. ఆయన హయాంలో కనీసం ఒక్కటంటే ఒక్క మధ్యస్థాయి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చెయ్యడం కానీ.. చెప్పుకోదగ్గ ఒక్క భారీ పరిశ్రమ కానీ జిల్లాలో అడుగు పెట్టిన దాఖలు లేదు. 2014 ఎన్నికల ప్రచారంలో తానూ అధికారంలోకి వస్తే రామాయపట్నం పోర్ట్ నిర్మిస్తానని.. పారిశ్రామిక కారిడార్ తీసుకొస్తానని, వెలుగొండ ని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేస్తానని పెద్ద ఎత్తున ఊదరగొట్టాడు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ఐదేళ్లలో వెనుకబడిన ప్రకాశం జిల్లా వాసుల చిరకాల స్వప్నం వెలుగొండ ప్రాజెక్టు నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. దొనకొండలో భారీ పారిశ్రామిక సెజ్ తీసుకొస్తానని ఆర్భాటంగా అనేకసార్లు ప్రకటనలిచ్చినప్పటికీ కనీసం అక్కడ ఒక్క పునాది రాయి కూడా పడకపోవడం విచారకరం. ఇక రామాయపట్నం పోర్ట్ సంగతయితే ఎప్పుడో అటకెక్కింది. అన్నింటికంటే హాస్యాస్పదం ఏంటంటే.. చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో చేసిన వాగ్ధానాల తాలూకు జిరాక్స్ కాపీని తీసుకొచ్చి 2019 ఎన్నికల ప్రచారంలో నన్ను మళ్లి గెలిపిస్తే ఈ పనులన్నీ ఈసారి పూర్తి చేస్తానని చదవడమే!!

అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో.. ఈ ఎనిమిది నెలల్లోనే వెలుగొండ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కావాల్సిన నిడుదలను విడుదల చెయ్యడంతో పాటు.. రామాయపట్నం పోర్ట్ నిర్మాణం సర్వే పనులు కూడా మొదలు పెట్టారు. మరోవైపు రామాయపట్నం సమీపంలో భారీ పేపర్ మిల్లుని ఏర్పాటు చెయ్యడానికి ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకొచ్చిన్నట్టు తెలుస్తుంది. అన్నిటింటికన్నా ముఖ్యంగా దాదాపు ఆరేళ్ళ తరువాత జిల్లా పరిధిలోని సాగర్ ఆయకట్టు పరిధిలో చివరి భూముల వరకూ పుష్కలంగా నీరందించడంతో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంవత్సరం నాగార్జున సాగర్ నుండి షుమారు 50 TMC ల జలాలు నికరంగా ప్రకాశం జిల్లాకు వచ్చాయి.

ఈ నేపథ్యంలో బస్సు యాత్రకు ఒంగోలు వస్తున్న చంద్రబాబు ప్రజలకు చెప్పడానికి ఒక్క అమరావతి తప్ప.. ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఆయన లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలు కూడా పెద్దగా ఏమీ లేవు. ఎలాగూ ఆయన రోడ్డు మార్గంలో ఒంగోలు వస్తున్నాడు కాబట్టి రహదారి పక్కనే కూతవేటు దూరంలో దివంగత రాజశేఖర రెడ్డి హాయంలో శంకుస్థాపన చేసుకొని ఆయన హయాంలోనే ప్రారంభమైన 4 TMC ల నిల్వ సామర్ధ్యంతో గుండ్లకమ్మ పై నిర్మించిన కందుల ఓబుల్ రెడ్డి జలాశయాన్ని సందర్శించి ప్రాజెక్టులు కట్టటం అంటే ఏమిటో తెలుసుకోవాలి. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హాయంలో ఈ ప్రాజెక్టుని రికార్డ్ స్థాయిలో పూర్తి చెయ్యడమే కాక, ప్రాజెక్టు ముంపు ప్రాంతాలకు, గ్రామాలకు దేశంలోనే మంచి పునరావాస ప్యాకేజి ఇవ్వడంతో పాటు ముంపు ప్రాంత వాసులందరికి రికార్డ్ సమయంలో ఒంగోలు నగరానికి అత్యంత దగ్గరలోనే పూర్తి వసతులతో కాలనీలు కూడా నిర్మించి ఇచ్చారు.

ఎలాగూ చంద్రబాబు హాయంలో ఎన్నిసార్లు శంకుస్థాపన రాళ్లు వేసినా.. నిర్దిష్టంగా పూర్తయిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి లేకపోగా… 2014 కు 70% పూర్తయిన వెలిగొండ ప్రాజెక్ట్ ను 5 ఏళ్లలో 30% పనులు చేసి పూర్తిచేయలేకపోయిన చంద్రబాబు “ఆత్మగౌర” నినాదం వెక్కిరిస్తుంది.

2 నెలల నుంచి చేస్తున్న రాజధాని రాజకీయాలు ఫలితాన్ని ఇవ్వకపోవటంతో ఆత్మగౌరవం పేరుతొ బస్సు యాత్ర మొదలు పెట్టిన చంద్రబాబు మరో నెల హడావుడి తప్ప ప్రజలకు ఒనగూరే మంచి ఏమి లేదు.

Show comments