iDreamPost
android-app
ios-app

అభివృద్ధి మీరు చేస్తే అధికారం వారికిచ్చారా…??

అభివృద్ధి మీరు చేస్తే అధికారం వారికిచ్చారా…??

ఒకరు కష్టపడి పని చేస్తే మరొకరు లబ్ది పొందారని చెప్పినట్లుంది వీరి వాదన. చెట్టును బట్టి కాయలుంటాయి. మనం చేసే పనులను బట్టి ప్రజల్లో మనకు గౌరవం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు.

ఎస్సీ, ఎస్టీ లకు మేమంటే మేము మేలు చేసామంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా వాగ్వాదానికి దిగాయి. గురుకుల పాఠశాలలను టీడీపీ ప్రభుత్వం తెచ్చిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎస్సీల్లో ఏ బి సి డి వర్గీకరణ తెచ్చామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రెండు వర్గాలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సోమవారం శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ లకు న్యాయం జరిగిందని చంద్రబాబు చెప్పారు.

అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడారు. చంద్రబాబు దళిత, బిసి, మైనారిటీలపై వివక్ష చూపించారని అన్నారు. ఇప్పుడు సీఎం చెప్పిన మాట పక్కనపెడితే అభివృద్ధి టిడిపి చేస్తే అధికారం వైసీపీకి ఎలా వస్తుందన్నని వాదన. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు తెచ్చింది. వాటన్నిటినీ సక్రమంగా అమలు చేసింటే ఎలా అధికారం చేజారుతుందని ప్రజల్లో చర్చ మొదలైంది. సమయం దొరికినప్పుడల్లా ప్రతిపక్ష నేతలు మేము అభివృద్ధి చేసాం అనటమే ఇప్పుడు కొత్త ప్రశ్నలు లెవనెత్తుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి జరిగివుంటే ప్రజలు వైసీపీకి అధికారం ఎందుకిస్తారు. సామాన్య ప్రజలు కూడా ఆలోచించే మాటలివి. ఇకనుంచైనా టీడీపీ నేతలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి