iDreamPost
android-app
ios-app

“ఓటుకు నోటు” – అవినీతి కేసు కాదు!

“ఓటుకు నోటు” – అవినీతి కేసు కాదు!

చంద్రబాబు నిర్వచనాల జాబితాలో “ఓటుకు నోటు” చేరింది. ఒక ఎమ్మెల్యే ఓటు కోసం ఐదు కోట్లు బేరమాడి 50 లక్షలు ఇస్తూ వీడియోలో చిక్కిన తెగలుగుదేశం ,మనవాళ్ళు “బ్రీఫ్ డ్ మీ “,అన్ని నేను చూసుకుంటాను అన్న బాస్  మాటలు ఆడియోలో విన్న రాష్ట్ర ప్రజలకు అవినీతి నిరోధక చట్టం గురించి బాస్ చంద్రబాబు కొత్త క్లాస్ బోధించారు.

ఓటుకు నోటు అవినీతి నిరోధక చట్టం కిందికి రాదంట.. మరి ఏసీబీ విచారణ ఎందుకు జరుగుతుందో మాత్రం చంద్రబాబు చెప్పలేదు. “నీకు ఏసీబీ ఉంది నాకు ఏసీబీ ఉంది” అని బాస్ ఎందుకు ఊగిపోయారో మర్చిపోయినట్లున్నాడు.

బహుశా ఏసీబీ కేసు అంటే ప్రభుత్వ ఆఫీసులలో టేబుల్ కింద చెయ్యొపెట్టటం మాత్రమే అని చంద్రబాబు ఆలోచాన కావచ్చు.

ఓటుకు నోటు కేసు “రాజకీయ ప్రేరేపితం” అని కోర్టు వాఖ్యానించిందట!!!ఏ కోర్టు ఎప్పుడు ఈ వాఖ్య చేసిందోకాని రాజకీయనాయకుల మీద ఉన్న కేసులన్నీ రాజకీయప్రేరేపితాలే అని చంద్రబాబు అన్నట్లుంది.మరి ఆ లెక్కలో రాజకీయ నాయకులందరూ పునీతులేనా?ఇంతకూ ఓటుకు నోటు కేసును కోర్టు కొట్టేసిందా?చంద్రబాబుకు క్లీన్ చిట్ వచ్చేసిందా?