iDreamPost
iDreamPost
కొన్ని సీన్లు సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజజీవితంలో కూడా సినీఫక్కీ యాక్షన్ ఎపిసోడ్స్ కనిపిస్తుంటాయి. ఇంచుమించు ఏ సినిమాలోనూ లేని ఒక హై ప్రొఫైల్ రాజకీయ సన్నివేశం ఈ రోజు హైదరాబాద్ రోడ్డుపై జరిగింది.
నిన్న ఒక తెరాసా ఎమ్మెల్యే లంచగొండితనంపై వై.ఎస్. షర్మిల ఆరోపణలు చేసారని ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు ఆమె వాహనాలపై దాడి చేసారు. ఆ క్రమంలో ఆమె వాడుతున్న బస్సు డ్యామేజ్ అయింది. ఆలాగే ఆమె కారు అద్దం కూడా పగిలింది. ఇదంతా నిన్న జరిగిన ఘటన.
అలా డ్యామెజైన కారుని ఆమె స్వయంగా లోటస్ పాండ్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ సీయం కేసీఆర్ ప్రగతిభవన్ లోకి ప్రవేశించబోయారు. ఆమె కారు వెనుకనే డ్యామేజైన బస్సు కూడా ఫాలో అయింది.
ఇది తెలుసుకుని ఉలిక్కిపడ్డ పోలీసులు ఆమెను రాజ్ భవన్ రోడ్డు వద్ద ఆపారు. కారు దిగమన్నారు. ఆమె నిరాకరించారు. దాంతో ఆమె కారులో ఉండగానే క్రేన్లు పెట్టి, టోవింగ్ వెహికల్ కి కట్టి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు లాక్కుపోయారు.
నిజానికి ఆమె వాహనాలపై జరిగిన దాడిని ప్రశ్నించడానికి ఆమె ప్రగతిభవన్ కు పయనమయ్యారు. కానీ మార్గమధ్యంలో పోలీసులు ఆమెను ఆపి పోలీస్ స్టేషన్ కు కారుపళంగా తీసుకెళ్లారు. జరిగింది ఇది.