iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు..

  • Published May 21, 2022 | 2:10 PM Updated Updated May 21, 2022 | 2:20 PM
  • Published May 21, 2022 | 2:10 PMUpdated May 21, 2022 | 2:20 PM
బాలీవుడ్ స్టార్ హీరోలపై కేసు నమోదు..

ఇటీవల స్టార్ సెలబ్రిటీలు డబ్బుల కోసం వివిధ రకాల యాడ్స్ లో నటిస్తున్నారు. కొంతమంది స్టార్లు ఒక అడుగు ముందుకి వేసి ఆల్కహాల్, పాన్ మసాలా యాడ్స్ కూడా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరోలు ముందున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్, అజయ్ దేవగణ్, అక్షయ్, అమితాబ్ లాంటి వాళ్ళు పాన్ మసాలా యాడ్స్ లో నటించడంతో నెటిజన్లు, అభిమానులు వీరిపై గత కొన్ని రోజులుగా విమర్శలు గుప్పించారు.

ఇలా నెటిజన్లు, అభిమానుల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో అమితాబ్, అక్షయ్ లాంటి హీరోలు ఈ ప్రకటనల నుంచి తప్పుకున్నారు. తాజాగా ఈ నలుగురు స్టార్ హీరోలపై కేసు నమోదైంది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన ఓ సామాజికవేత్త తమన్నా హష్మీ ఈ హీరోలపై ఫిర్యాదు చేశాడు.

అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, రణ్‌వీర్‌ సింగ్‌, అక్షయ్ కుమార్ లాంటి స్టార్‌ హీరోలు డబ్బు కోసం గుట్కా ప్రకటనల్లో కనిపించి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపాడు. ఈ నలుగురు హీరోలపై సెక్షన్‌ 467, 468, 439, 120 బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. మే 27న ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది. మరి ఇలాంటి ప్రకటనల్లో నటించకుండా ఉండేలా కోర్టు ఏదైనా తీర్పు ఇస్తుందేమో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet